పేదల భూములను కబ్జా చేస్తున్న బీఆర్​ఎస్​ నేతలపై క్రిమినల్​ కేసులు పెట్టాలి : యెర్రా కామేశ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పట్టణంలోని పేదల భూములను కబ్జా చేస్తున్న బీఆర్​ఎస్​ నేతలపై క్రిమినల్​ కేసులు పెట్టాలని బీఎస్పీ స్టేట్​ జనరల్​ సెక్రటరీ యెర్రా కామేశ్ డిమాండ్​ చేశారు. పట్టణంలోని పాత కొత్తగూడెంలో బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు ఆక్రమించిన ల్యాండ్​ను బీఎస్పీ నేతలు ఆదివారం సందర్శించారు. 

పాత కొత్తగూడెంలో పేదలకు పంచేందుకు సెలెక్ట్ చేసిన గవర్నమెంట్​ ల్యాండ్​ను కొందరు బీఆర్​ఎస్​ నేతలు ఆక్రమించుకోవడం దారుణమన్నారు. గాజుల రాజం బస్తీ, రైతు మార్కెట్​ ప్రాంతాల్లో రూ. కోట్ల విలువైన సర్కార్​ భూమిని ఆక్రమించిన బీఆర్​ఎస్​ నాయకులు, ప్రజాప్రతినిధులపై కలెక్టర్​ సమగ్ర విచారణ చేసి కేసులు పెట్టాలని కోరారు. లేని పక్షంలో బీఆర్​ఎస్​ ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు.