యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అసమర్థ పాలన కారణంగా 2014 నుంచి ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధిలో వెనకబడిందని మండిపడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బీర్ల అయిలయ్యను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు బీఆర్ఎస్ లోని బడా నేతలంతా ఏకమైనా..
ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారన్నారు. భువనగిరిలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు గవ్వల నర్సింహులు, భువనగిరి జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గంలో కురుమలకు చోటు కల్పించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో యాదగిరిగుట్ట పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాటబత్తిని ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు ఎరుకల హేమేందర్ గౌడ్
బందారపు బిక్షపతి, వెంకటేశ్ గౌడ్, బీరుమల్లయ్య, బాలరాజు, గోపాల్, శ్రీనివాస్, బాలయ్య, బీసీ సంఘం లీడర్లు జూకంటి రవీందర్, డోకె బాలకృష్ణ, అచ్చయ్య, రాములు, సత్యనారాయణ, శ్రీశైలం, సత్యనారాయణ, భాస్కర్, కిష్టయ్య, పర్వతాలు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.