Yes Bank: Q4లో లాభాల మోత మోగించిన యెస్ బ్యాంక్.. ఇన్వెస్టర్ల పండగ..

Yes Bank: Q4లో లాభాల మోత మోగించిన యెస్ బ్యాంక్.. ఇన్వెస్టర్ల పండగ..

Yes Bank Q4 Profits: ఈక్విటీ మార్కెట్లలో భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడి పెట్టే షేర్లలో యెస్ బ్యాంక్ కూడా ఒకటి. వాస్తవానికి కంపెనీ ప్రమోటర్ల అవకతవకలు బయటపడిన తర్వాత రిజర్వు బ్యాంక్ దీనిని గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనాకి మునుపు యెస్ బ్యాంక్ షేర్లు భారీగా కుప్పకూలి రూ.10 కంటే కిందికి పడిపోయిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ తన నాల్గవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన యెస్ బ్యాంక్ లాభాలు మార్చితో ముగిసిన త్రైమాసికంలో 63 శాతం పెరిగి రూ.738 కోట్లుగా నమోదైంది. దీంతో గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నమోదు చేసిన రూ.452 కోట్ల కంటే ఇది మెరుగైన పనితీరుగా నిలిచింది. ప్రధానంగా కంపెనీ ప్రొవిజన్స్ తగ్గుదలతో పాటు నిరర్థక రుణాల ప్రభావం తగ్గుదల దీనికి కారణంగా తెలుస్తోంది.

Also Read:-పబ్లిక్​ కంపెనీగా ఫోన్​పే.. త్వరలోనే ఐపీఓ

25 ఆర్థిక సంవత్సరంలో మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం యెస్ బ్యాంక్ కి మరో ముఖ్యమైన క్వార్టర్ అని ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ అన్నారు. దీనికి కారణం అనేక కీలక మెట్రిక్స్‌లో స్థిరమైన మెరుగుదలను చూసిందని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఈ మెరుగైన లాభాలతో కంపెనీ ఇన్వెస్టర్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.