Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..

దేశీయ స్టాక్ మార్కెట్ లో రెండో త్రైమాసికం ఫలితాలను ఆయా కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ భారీ లాభాలతో ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది. 

సెప్టెంబరుతో ముగిజిన త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం రూ. 553 కోట్లుగా నమోదు అయింది. గతేడాది రూ. 2252 కోట్లు ఉండగా.. 100 శాతానికి పైగా లాభాలు పెరిగాయి. కంపెనీ నికర వడ్డీ ఆదాయం 14.3శాతం పెరిగి రూ.2200 కోట్లకు చేరుకుంది. యెస్ బ్యాంకు అత్యుత్తమ పనితీరుతో అసెట్ క్వాలిటీ కూడా మెరుగుపడింది. 

రెండో త్రైమాసికంలో స్థూల నాన్ పెర్మార్మింగ్ అసెట్ నిష్పత్తి 1.7 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గి రూ. 3889.33 కోట్లకు చేరింది. నికర NPAలు మునుపటి త్రైమాసికంలో రూ.1,246 కోట్లు ఉండగా.. ఈ త్రైమాసికంలో రూ.1,168 కోట్లకు తగ్గాయి. 

ALSO READ | దేశంలో తగ్గనున్న బ్యాంకులిచ్చే లోన్లు

యెస్ బ్యాంక్ నికర అడ్వాన్సులు రూ.2.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో త్రైమాసిక ప్రాతిపదికన ఇవి 2.4 శాతం, ఏడాది ప్రాతిపదికన 12.4 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. కంపెనీ మెుత్తం రుణాల్లో రిటైల్ 59 శాతం, మిడ్ కార్పొరేట్స్ 16 శాతం, కార్పొరేట్స్ వద్ద మిగిలిన 25 శాతం ఉన్నాయి. 

బ్యాంక్ గడచిన త్రైమాసికంలో వేగంగా రుణాలను అందిస్తూ వ్యా పారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలో బ్యాంక్ వద్ద ఉన్న డిపాజిట్స్ ఏడాది ప్రాతిపదికన 18.3 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లుగా ఉన్నాయి.