ఒకప్పుడు తాను ప్లేబాయ్‌నే అని దేవదూతను కాదని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గత ఏడాది పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానానికి ముందు రిటైర్డ్ మాజీ ఆర్మీ జనరల్ జావెద్ బాజ్వా తనను ప్లేబాయ్ అని ఆరోపించినట్లు ఇమ్రాన్ తెలిపారు. ఇటీవల ఇమ్రాన్ వాయిస్తో రిలీజైన కొన్ని అసభ్యకర ఆడియోల గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందిన నేతల ఆడియోలు, వీడియో క్లిప్‌లు తన వద్ద ఉన్నట్లు బాజ్వా చెప్పారన్నారు. తనను ప్లేబాయ్ అని బాజ్వా పేర్కొన్న విషయాన్ని ఇమ్రాన్ గుర్తు చేశారు.
గతంలో తాను ప్లేబాయ్‌నే అన్న విషయాన్ని బాజ్వాకు చెప్పానని.. తానేమీ దేవదూతను కాదని ఇమ్రాన్ అన్నారు. ఆ సమయంలోనే తనను ప్రధాని నుంచి తప్పించాలని బాజ్వా పన్నాగం వేశారని ఆరోపించారు. బాజ్వా డబుల్ గేమ్ ఆడుతున్న విషయాన్ని పసికట్టినట్లు తెలిపారు. షహబాజ్ షరీఫ్‌ను ప్రధాని చేయాలని బాజ్వా ప్రయత్నించారని, దాని కోసం అతను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తనను అధికారంలోకి రాకుండా చూసేందుకు ప్రస్తుతం మిలిటరీలో బాజ్వా వ్యక్తులు పనిచేస్తున్నారన్నారు. జనరల్ బాజ్వాకు పొడిగింపు ఇచ్చి పొరపాటు చేసినట్లు ఇమ్రాన్ పేర్కొన్నారు.