Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..

Good Health: వాసన పీలిస్తే చాలు: బరువు తగ్గటానికి సూపర్ టెక్నీక్ ఇది..

పిజ్జాలు, బర్గర్లు, షుగర్ ఎక్కువగా ఉండే కుకీస్, స్వీట్లు చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ ఆహార పదార్ధాలను ఎవరైనా ఇష్టంగానే తింటారు. కానీ వాటిని తింటే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వాటిని తినడం ఎలా? అందుకు ఓ ఉపాయం ఉంది అంటున్నారు సైంటిస్టులు. ఏంటంటే ఏవి తినాలి అని మీకు అనిపిస్తుందో, వాటి వాసన పీల్చుకోండి. అవును 2 నిమిషాల పాటు అలా ఆ ఆహార పదార్థాల వాసన చూస్తే చాలు మీకు వాటిని తిని కడుపు నిండిన భావన కలుగుతుందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. 

ఇటీవల, జర్నల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం... సైంటిస్టులు కొందరికి 30 సెకండ్ల పాటు పలు కుకీల వాసన చూపించారు. దీనితో వారికి ఆ కుకీలను తినాలనే ఆసక్తి కలిగింది. తరువాత వారికి 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు పిజ్జాలు, స్ట్రాబెర్రీల వాసన చూపించారు. దీనితో వారికి పిజ్జాల మీద ఆసక్తిపోయి కడుపు నిండిన భావన కలిగింది. అనంతరం వారు స్ట్రాబెర్రీలను తినేందుకు ఆసక్తి చూపించారట. 

ALSO READ | రిపబ్లిక్ డే ఇలా కూడా: స్కూల్ డేస్ గుర్తు చేసుకుందామా

అలాగే పిజ్జాలు, యాపిల్స్ తో మరోసారి టెస్ట్ చేయగా, 2 నిమిషాల అనంతరం వారికి కూడా కడుపు నిండిన భావన కలగడంతో పాటు వారు కూడా పిజ్జాలకు బదులుగా యాపిల్స్ ను తినేందుకు ఆసక్తి చూపించారట. దీని వల్ల సైంటిస్టులు చెప్పేదేంటంటే.. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను తినాలనిపిస్తే వాటి వాసన 2 నిమిషాల పాటు చూస్తే చాలు. ఇక ఆ ఆహారాలను తినాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనిద్వారా అధిక బరువు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు