క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శం

క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఏడాదికి 20 వేల కోట్ల వడ్డీ లేని ఋణాలు అందించబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి మార్గదర్శకమన్నారు. బుధవారం రాత్రి ఎల్బీస్టేడియంలో మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు సారధ్యంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా మల్లు భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. క్రీస్తు బోధనలను ఇందిరమ్మ రాజ్యం అనుసరిస్తుందని, పేదల పక్షాన ఉంటుందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రపంచంలో శాంతిని స్థాపించేందుకు ఏసుక్రీస్తు బోధనలు చేశారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ , ఎమ్మెల్యేలు సత్యనారాయణ , ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మీ కాంతారావు, బ్రదర్ మోహన్ లాజరస్ పాల్గొన్నారు.