యెజ్డీ.. ఈ బైక్ స్టయిలే కాదు.. సౌండ్ కూడా స్పెషల్. రెండు సైలెన్సర్లతో.. డుగుడుగు అంటూ ఇది చేసే సౌండ్ బట్టే చెప్పేయొచ్చు.. అది యెజ్డీ బైక్ అని.. పాతికేళ్ల క్రితం రోడ్ కింగ్ బైక్ అండే యెజ్డీనే.. దీనికి మరో స్పెషల్ కూడా ఉంది.. కిక్ రాడ్ నే గేర్లుగా ఉపయోగిస్తారు.. ఇప్పుడు అయితే వేర్వేరుగా ఉంటున్నాయి కానీ.. అప్పట్లో యెజ్డీ బైక్ కు కిక్ రాడ్ నే గేర్లుగా ఉండేవి.. కాలం మారే కొద్దీ.. కొత్త బైక్స్ రావటంతో యెజ్డీ ఆగిపోయింది. పాతికేళ్ల తర్వాత యెజ్డీ రోడ్ కింగ్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బైక్..
మహీంద్రా సాయంతో..
మహీంద్రా 2022లో మూడు బైకులను విడుదల చేసింది. జావా 300, జావా 42, జావా పెరాక్ పేరుతో మూడు మోడళ్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది యెడ్జీ బైక్ను రీ లాంచ్ చేసేందుకు సన్నద్దమవుతోంది. అయితే ఎప్పుడు రీలాంఛ్ చేస్తోందో ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు కానీ..ఆగస్టులో యెడ్జీ బైక్ను ఆవిష్కరించబోతుందని తెలుస్తోంది. యెడ్జీ మూడు బైకుల ఫోటోలను అధికారిక వెబ్ సైట్ లో పెట్టింది. యెడ్జీ రోడ్ కింగ్, యెడ్జీ క్లాసిక్, యెడ్జీ CLII, యెడ్జీ డీలక్స్, యెడ్జీ 175, యెడ్జీ మోనార్క్ ఫోటోలు ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్నాయి.
అసలు యెజ్డీ కథేంటి..
యెజ్డీ అనే బైక్‌ను జావా కంపెనీ తయారు చేసింది. జావా కంపెనీని చెక్ రిపబ్లిక్ వ్యాపారవేత్త ‘ఫ్రాంటి జాన్స్ కీ’ 1929లో ప్రారంభించారు. 1960లో మైసూర్ లో జావా కంపెనీ స్థాపించబడింది. 1961లో జావా తన మొదటి బైక్ ‘జావా 250 టైప్ 353’ని విడుదల చేసింది. దీని తరువాత, కంపెనీ జావా 50, జావా 50 టైప్ 555 అనే మరో రెండు మోడళ్లను విడుదల చేసింది. ఈ మూడు మోడళ్ల బైక్‌ల ద్వారా జావా దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత జావా ‘ఎజ్డీ జెట్ 60’ పేరుతో తొలి బైక్‌ను విడుదల చేసింది. తరువాతి 3 దశాబ్దాల వరకు, జావా ఈ రేసింగ్ బైక్‌లతో ఏ కంపెనీ పోటీపడలేదు.
1973 వరకు చెక్ రిపబ్లిక్ కంపెనీ జావా యెజ్డీ కంపెనీకి చెందిన బైక్‌ను తయారు చేస్తుండగా..ఆ ఏడాది జావా కంపెనీ లైసెన్స్ గడువు ముగిసింది. అయితే లైసెన్స్ పునరుద్దరణకు బదులుగా రుస్తుమ్ ఇరానీ సొంతంగా కంపెనీని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. రుస్తోమ్ తన కంపెనీని యెజ్డీ పేరుతో రిజిస్టర్ చేసుకున్నాడు. తన కంపెనీని ఏర్పాటు చేసిన తర్వాత ఇరానీ మొదటి 250సీసీ ఎజ్డీ బైక్‌ను విడుదల చేశారు. యెడ్జీ కంపెనీ ఈ బైక్‌ను 60కి పైగా దేశాల్లో అమ్మింది. యెడ్జీ రోడ్ కింగ్, యెడ్జీ క్లాసిక్, యెడ్జీ CLII, యెడ్జీ డీలక్స్, యెడ్జీ మోనార్క్ మోడల్స్ అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
యెజ్డీని ఎందుకు మూసేశారంటే
యెడ్జీ కంపెనీ 1996లో మూతపడింది. ఆ ఏడాది చివరి బైక్ ను రిలీజ్ చేసిన తర్వాత కంపెనీ మూతపడింది. దీని వెనుక ముఖ్యంగా మూడు కారణాలున్నాయి.1990 తర్వాత మార్కెట్లోకి ఎన్నో కొత్త బైక్‌లు వచ్చాయి. ఈ బైకులు యెజ్డీ బైక్‌ల అమ్మకాలపై ప్రభావం చూపాయి. దీంతో యెడ్జీ బైక్‌లు తక్కువగా అమ్ముడుపోయాయి. బైకులు తక్కువగా అమ్ముడుపోవడంతో యెజ్డీ ఉత్పత్తిని తగ్గించారు. దీనికి తోడు భారీ సంఖ్యలో కార్మికులను తొలగించారు. యెడ్జీ ఎక్కువ కాలుష్యం విడుదల చేయడం వల్లా చాలా దేశాల్లో వీటిపై నిషేధం విధించారు.