నిర్మల్​జిల్లా భైంసా మార్కెట్​ను ముంచెత్తుతున్న దిగుబడులు

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్​కమిటీ పరిధిలోని గ్రెయిన్​మార్కెట్​ యార్డును వ్యవసాయ ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి. రోజుకు సరాసరి 300 మందికి పైగా రైతులు ఇక్కడి మార్కెట్​కు వ్యవసాయ దిగుబడులను విక్రయానికి తీసుకొస్తున్నారు. 

దీంతో గాంధీ గంజ్​లోని యార్డు మొత్తం నిండిపోయింది. ముఖ్యంగా సోయా, కందులు, శనగల దిగుబడులు అధిక మొత్తంలో విక్రయాల కోసం తీసుకొస్తున్నారు. శనివారం స్థానిక మార్కెట్​లో శనగలు క్వింటాల్​కు రూ.5,913, కందులు రూ.9,823, సోయా రూ. 4,496, మొక్కజొన్న రూ.2,229, జొన్న రూ.2,666 ధరలతో కొనుగోళ్లు జరిగాయి.