
నల్గొండ అర్బన్, వెలుగు: యోగా, మెడిటేషన్‌తో గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుందని డీడబ్ల్యూవో సక్కుబాయి, సీడీపీవో నిర్మల, డాక్టర్ విఠల్ బాబు సూచించారు. మంగళవారం పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆర్య జనని గర్భిణుల అవగాహన సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. గర్భిణులు సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని, లేదంటే పుట్టబోయే బిడ్డపై రేడియేషన్ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వారి అలవాట్లు, పరిసరాల ప్రభావం కూడా ఉంటుందని చెప్పారు. శ్రీవాణి, వేదాంత రామకృష్ణమాచార్యులు ఉన్నారు.