Good Health : ట్యాబ్లెట్లు లేకుండానే.. ఈ ఆసనాలతో బీపీకి చెక్ పెట్టొచ్చు..!

ఒకప్పుడు అధిక రక్తపోటు అంటే నలభై, యాభై యేళ్ళు దాటిన వాళ్లకే వచ్చేది. కానీ ఈ జనరేషన్ హై బీపీకి ఫిట్నెస్ ఇంటి చిట్కాలుకి చిన్న వయసులోనే ఈ సమస్య ఎదురవుతోంది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. చాలామంది. కానీ, ఈ సమస్యకు మందులొక్కటే పరిష్కారం కాదు. యోగాసనాలతో కూడా ఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు. హై బ్లడ్ ప్రేజర్ని అదుపులో ఉంచే యోగాసనాలు మీకోసం.
 
 బోర్లా పడుకుని రెండుచేతులను ఛాతి దగ్గర పెట్టాలి. రెండుం కాళ్లని దగ్గరికి ఉంది, చేతులను నేలకు ఆనించాలి. వాటిని ఆసరాగా చేసుకుని నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ తల, భుజాలను పైకి లేపాలి. రెండు కాళ్లని కూడా పైకి, వెనక్కి మడవాలి. ఈ స్థితిలో 10 నుంచి 20 సెకన్లు ఉండాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా యథాస్థితికి రావాలి. ఈ ఆసనాన్ని మూడుసార్లు చేయాలి. అధిక రక్తపోటు ఒక్కటేకాదు, ఈ ఆసనం వల్ల గుండెకి రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు సులభంగా కరుగుతుంది. ఈ ఆసనాన్ని నెమ్మదిగా, ప్రశాంతంగా చేయాల్సి ఉంటుంది.

పాదాసనం

మోకాళ్లపై కూర్చొని ఎడమ చేతిని సమాంతరంగా ముందుకు చాపాలి. కుడి కాలిని సమాంతరంగా వెనక్కి చాపాలి. ఇప్పుడు కుడి అరచేతిని ఫొటోలో చూపిన విధంగా నెలకు అనించి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను పైకెత్తే ప్రయత్నం చేయాలి. ఇలా ఐదు నుంచి పది సెకన్లు ఉన్నాక శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమ కాలిని, కుడి చేతిని పైకి లేపి చేయాలి. ఇలా మార్చి మార్చి పదిసార్లు చేయాలి. ఈ ఆసనం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈ ఆసనం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరుగుతుంది.

ముద్రాసనం

ఈ ఆసనాన్ని సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చొని చేయాలి. నిటారుగా కూర్చొని రెండు చేతులు చూపుడువేళ్లని బొటనివేలుకి కలపాలి. మధ్య, చిటికెనవేలు, ఉంగరం వేలుని నిటారుగా ఉంచాలి. చేతుల్ని మోకాళ్ల పైన ఉంచి కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. నాలుగు నుంచి ఐదు నిమిషాల ఈ ముద్రలో ఉండి ఆసనం నుంచి బయటకు రావాలి. ఈ ముద్రని రోజుకి రెండు మూడు సార్లు చేస్తే మంచిది. ఎప్పుడు చేసినా ఐదు నిమిషాలకు మించి చేయకూడదు. దీనివల్ల అధిక రక్తపోటుకి చెక్ పెట్టొచ్చు.

ఏకపాద ధనురాసనం

బోర్లా పడుకుని ముందు కుడి కాలిని వెనక్కి మడిచి, ఆ కాలి మడిమను కుడి చేత్తో పట్టుకోవాలి. తరువాత ఎడమ కాలిని వెనక్కి చాపాలి. అదే సమయంలో ఎడమ చేయి కూడా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమకాలు, ఎడమచేయి, కుడి మోకాలు, తల పైకి లేపాలి. ఈ స్థితిలో పది నుంచి ఇరవై సెకన్లు ఉండాలి. తరువాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. ఇలా మూడు సార్లు చేయాలి . తర్వాత ఎడమకాలితో కూడా ఇలానే చేయాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఛాతి, గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. పొట్ట దగ్గర కొవ్వు కూడా తగ్గుతుంది.

విపరీత కరణి

యోగా మ్యాట్ పై వెల్లకిలా పడుకోవాలి. ఇప్పుడు ఫొటోలో చూపిన విధంగా రెండు కాళ్లని 90 డిగ్రీల కోణంలో పైకి లేపి గోడకు సమాంతరంగా ఆన్చాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేయాలి. ఈ పొజిషన్లో 5 నుంచి 10 నిమిషాలు ఉండి, తర్వాత కాళ్లను మడిచి ఛాతి దగ్గరకు తీసుకొచ్చి చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఈ పొజిషన్ లో 20 నుంచి 30 సెకన్ల పాటు ఉండి ఆసనం నుంచి బయటకు రావాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే అధికరక్తపోటు అదుపులో ఉంటుంది.