నెలసరి బాధలు తగ్గించే యోగ
అమ్మాయిల్లో నెలసరి మొదలయ్యాక అనేక రకాల సమస్యలు. అధిక రక్తస్రావం, లేదంటే టైంకి రావపోవడం లాంటివి ఎక్కువగా వేధిస్తుంటాయి. నెలసరి అంటే చాలు చాలామందిలో ఏదో తెలియని భయం కూడా ఉంటుంది. కొంతమందికి ఆ టైంలో కడుపులో విపరీతమైన నొప్పి, వాంతులు, వికారం.. మరికొందరికి పొట్ట బిగిసినట్టుంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. కానీ ఈ ఆసనాలు ప్రయత్నిస్తే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.
ఏక పాదాసనం
ఈ ఆసనం కోసం రెండు కాళ్ల స్ట్రెయిట్ గా ముందుకు చాపి కూర్పోవాలి ఫొటోలో చూపిన విధంగా కుడి కాలిని కొంచెం పైకి లేపి ఎడమచేత్తో పట్టుకోవాలి. ఇప్పుడు వెన్నెముకని నిటారుగా ఉంచి, కుడి అరచేతిని నేలకు ఆనించి కూర్చోవాలి, నడుము, చేతులు, భుజాలు కుడి వైపుకి తీసుకురావాలి. ఇలా చేసేటప్పుడు నడుము బాగా మెలితిరుగుతుంది. ఈ ఆసనంలో అర నిమిషం పాటు ఉండి తర్వాత మొదటి పొజిషన్ కి రావాలి. మళ్లీ ఎడమకాలితో అసవాన్ని వేయాలి రెండు కాళ్లతో అరుసార్లు ఆసనం వేయాలి. ఈ ఆసనం వల్ల నెలసరిలో రక్తస్రావం అదుపులో ఉంటుంది. అలాగే వికారం, వాంతులు లాంటివి కూడా తగ్గుతాయి.
పార్శ్వకోణాసనం
నిటారుగా నిలబడి రెండుకాళ్లనూ స్టైట్ చేయాలి. ఇప్పుడు కుడి పాదాన్ని కుడి వైపుకి తిప్పాలి. కుడి మోకాలిని 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఇప్పుడు కుడి చేతిని ఫొటోలో చూపిన విధంగా వెనక్కి వెనుక నుంచి రాసిచ్చి రెండు చేతులు లాక్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు తలపైకి ఎత్తి పైకి చూడాలి. ఈ ఆసనంలో 20 సెకన్లు ఉంది. తర్వాత యథాస్థితికి వచ్చి 10 సెకన్ల విరామమిచ్చి మళ్లీ మరొక కాలితో ఆసనాన్ని ప్రయత్నించాలి.. ఈ ఆసనం నెలసరి సమస్యలతో పాటు గర్భాశయ సమస్యలున్న వారికి కూడా మేలు చేస్తుంది.
నమస్కార ముద్రాసనం
నిటారుగా నిలబడి రెండు చేతులూ మెల్లగా పైకి తీసుకొచ్చి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాన తీసుకుంటూ సాధ్యమైనంత వరకు వెనక్కి వంగాలి. చేతులు రెండు చెవుల పక్కన ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో సాధ్యమైనంత వరకు ఉండి. నేమ్మదిగా త్యాసతీసుకుంటూ మొదటి పొజీషనికి రావాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట దగ్గడ కందరాలు పూర్తిగా సైడ్ అవుతాయి. నెలసరి సక్రమంగా దానివాళ్లకి నెలసరిలో ఎక్కువగా రక్తస్రావం అయ్యేవాళ్లకి ఈ అనడం చాలా ఉపయోగపడుతుంది. ఇలాగే ఈ ఆసనం వల్ల నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మత్స్యాసనం
మొదల పద్మాసనంలో కూర్చోవాలి ఇప్పుడు కుడి పాదాన్ని ఎడమ తొడమీద ఎడమపాదాన్ని కుడి తొడ మీద ఉంచాలి. తరువాత నెమ్మదిగా రెండు మోచేతులను వెనక్కి పెట్టాలి. మెల్లగా వెనక్కు వాలి తలను నేలమీద ఉంచే ప్రయత్నం చేస్తూ మాడు వేలకు ఆనించాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు శ్యానసు మామూలుగా తీసుకుని పదులుతూ 20 నుంచి 30 సెకన్ల పాటు ఉండాలి. తల మీద ఎక్కువ బరువు వేయకూడదు. ఈ ఆసనం బాగా అలవాటయ్యేదాకా. అదుసార్లు దీర్ఘంగా శ్వాసతీసుకుని వదలాలి. దీనివల్ల ఛాతిలో భుజాల్లో, గొంతు దగ్గడ ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస సంబంధ సమస్యలు అదువులో ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా అదుపులో ఉంటుంది. పక్కటెముకలు, కండరాలు సాగి బలంగా తయారయ్యి నెలసరిలో వచ్చే నొప్పి సమస్య అదుపులో ఉంటుంది. మోకాళ్ల నొప్పులున్న వాళ్లు ఈ అనేదానికి దూరంగా ఉండాలి..
ప్రాణాయామం
సుఖాసనంలో కూర్చొని రెండు చేతులను చిన్ముద్రలో పెట్టాలి. ఇప్పుడు వెన్నెముకని నిటారుగా ఉంచి నాలుక చివరసు అంగి తాకించి ముక్కు ద్వారా మెట్లగా శ్వాస తీసుకుంటూ, బయటకు వదిలేస్తూ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు రావాలి.. శ్వాస వదిలేసేటప్పుడు పొట్ట లోపలికి పోవాలి. ఇలా మూడు. నిమిషాలు చేయాలి. ఇలా చేయడం పల్ల నెలసరిలో వచ్చే అధిక ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆసనాన్ని రోజు వేయడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.