మొగుళ్లపల్లి/మల్హర్/శాయంపేట, వెలుగు : కేంద్ర పథకాలను అర్హులందరికీ చేరాలన్న ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్పయాత్ర చేపట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ డైరెక్టర్ యోగేశ్ మోహన్ దీక్షిత్ చెప్పారు. భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి గురువారం కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. అలాగే మల్హర్ మండలం కొయ్యూరులో ఎస్‌బీఐ, టీజీబీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అమలు చేసే ప్రతి పథకం లబ్ధిదారుడికి అందాలని సూచించారు.
కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. భూపాలపల్లిలో ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, తిరుపతి, మల్హర్ మండలంలో ఎంపీపీ మల్హర్‌రావు, ఎంపీడీవో నరసింహమూర్తి, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ జాయింట్ సెక్రటరీ హీన ఉస్మాన్ మాట్లాడారు. కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, బ్యాంక్ మేనేజర్ చక్రధర్, ఆదిరెడ్డి భారత్ గ్యాస్ ప్రొప్రైటర్ దుంపల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.