సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒడిలో కూర్చున్న పిల్లి.. ఫొటో వైరల్

సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒడిలో కూర్చున్న పిల్లి.. ఫొటో వైరల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సంబంధించిన ఫొటో ఒకటి 2022లో దిగిన ఫొటోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పరిపాలనా నైపుణ్యాన్ని నిరూపించుకుంటూనే యోగి.. జంతువులు, పక్షులపైనా ప్రేమను కురిపిస్తారని ఈ ఫొటో చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఫొటోలో యోగి సంప్రదాయ కాషాయ వస్త్రాలు ధరించి ఉండగా తన కార్యాలయంలో కూర్చొని ఉండగా.. అతని ఒడిలో ఓ పిల్లి వచ్చి కూర్చుంది. ఈ ఫొటోను సీఎం యోగి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాంతో పాటు జంతువులు, పక్షులు కూడా స్నేహితులు, శత్రువుల మధ్య తేడాలను గుర్తిస్తాయనే హిందీ సామెతను క్యాప్షన్ గా రాసుకొచ్చారు.

ఈ ఫొటోను షేర్ చేసిన అర గంటలోనే 3500లైక్స్, 550కి పైగా మంది రీట్వీట్ చేశారు. దాంతో పాటు 73 వేల వ్యూస్ వచ్చాయి. గతంలోనూ గోరఖ్ పూర్ జంతు ప్రదర్శనశాలలో సీఎం యోగి చిరుతపులి పిల్లలలకు ఆహారం తినిపిస్తున్న చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, ప్రజాసంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సీఎం యోగి.. జంతువుల పట్ల ప్రేమ, కరుణను కూడా కురిపించడంలో పేరుగాంచారని పలువురు అభిప్రాయపడుతున్నారు.