ఎక్స్ (X) బ్లూ టిక్స్ అన్నీ ఎగిరిపోయాయి : సీఎం అకౌంట్ కూడా మారింది

ఎక్స్ (X) బ్లూ టిక్స్ అన్నీ ఎగిరిపోయాయి : సీఎం అకౌంట్ కూడా మారింది

ప్రభుత్వ 'హర్ ఘర్ తిరంగ ప్రచారం'లో భాగంగా తమ ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకానికి మార్చిన తర్వాత ముఖ్యమంత్రులతో సహా పలువురు రాజకీయ నాయకులు 'X'లో గోల్డెన్, బ్లూ టిక్‌లను కోల్పోయారు. వీరిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, గోవా సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ 'X'లో గోల్డెన్ టిక్ కోల్పోయిన నాయకులలో ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా కూడా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కూడా దాని ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకానికి మార్చిన తర్వాత గోల్డెన్ టిక్‌ను కోల్పోయింది.

అంతకుమునుపు నిబంధనలు పాటించని దాదాపు 24లక్షల మంది అకౌంట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీనే వెల్లడించింది. జూన్, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23లక్షల 95వేల అకౌంట్లను బ్లాక్ చేసినట్టు స్పష్టం చేసింది. లైంగిక, అశ్లీలతకు సంబంధించిన కంటెంట్ ఉన్న ఖాతాలే ఇందులో ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా 1వెయ్యి 772 అకౌంట్లు ఉన్నాయని కూడా కంపెనీ వివరించింది.