న్యూఢిల్లీ: రెండోసారి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు యోగి ఆదిత్యానాత్ అంతా సిద్ధం చేసుకున్నారు. రేపు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగే ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. ప్రమాణ స్వీకారానికి 45 వేల మంది ప్రజలను ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. కాగా, ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా అమిత్ షాను యోగి ఆహ్వానించారు. యూపీ కేబినెట్ లో ఎవర్ని తీసుకోవాలనే దానిపై ఇరు నేతలు సమాలోచనలు చేశారని తెలుస్తోంది. ఇకపోతే, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పేరు ఖరారైనప్పటికీ డిప్యూటీ స్పీకర్ గా ఎవర్ని నియమిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆ పదవిలో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలనే కొనసాగిస్తారని సమాచారం.
మరిన్ని వార్తల కోసం: