జై శ్రీరాం : ఆ ఒక్క రోజు అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు

జై శ్రీరాం : ఆ ఒక్క రోజు అయోధ్యకు 100 చార్టర్డ్ విమానాలు

జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా 100 చార్టర్డ్ విమానాలు అయోధ్య విమానాశ్రయంలో దిగాలని భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

జనవరి 22న అయోధ్య విమానాశ్రయంలో దాదాపు 100 చార్టర్డ్ విమానాలు దిగుతాయని అంచనా వేస్తున్నట్లు ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు ఇండిగో విమానాన్ని ప్రారంభించిన వర్చువల్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. లక్నోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆదిత్యనాథ్ తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు.