ఢిల్లీలో బిజీబిజీగా యోగి ఆదిత్యనాథ్

ఢిల్లీలో బిజీబిజీగా యోగి ఆదిత్యనాథ్

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. కేబినెట్ కూర్పుపై కసరత్తు చేస్తోంది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యోగి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. పార్టీ పెద్దలతో కలిసి యోగి 2.0 కేబినెట్ మంత్రుల పేర్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీలోని బీజేపీ పార్టీ హెడ్ క్వార్టర్స్లో పార్టీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. సీనియర్ నేతలైన దినేష్ శర్మ, స్వతంత్రదేవ్ సింగ్ లు ఆయన వెంట ఉన్నారు. 


యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ మంత్రుల పేర్లు, ప్రమాణ స్వీకారోత్సవ ముహూర్తం ఖరారు తదితర అంశాలపై యోగి ఆదిత్యనాథ్ పార్టీ సీనియర్లతో చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మండలి ఎన్నికల అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 273  స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. హోలీ అనంతరం యోగి నేతృత్వంలో రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరనుంది.

For more news..

తెలంగాణ సీఎస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి

గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!