Boomer Uncle Official OTT: తెలుగు ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్టైనర్..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Boomer Uncle Official OTT: తెలుగు ఓటీటీలో యోగిబాబు కామెడీ ఎంటర్టైనర్..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

తమిళ కమేడియన్ యోగిబాబు(Yogibabu)  ప్రస్తుతం కోలీవుడ్ బడా స్టార్స్తో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అతని చేతిలో ఒక పదికి పైగా సినిమాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, కోలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న నటుడు యోగిబాబు.

లేటెస్ట్గా యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మూవీ  ‘బూమర్‌ అంకుల్‌’(Boomer Uncle ). ఈ సినిమా మార్చి నెలలో కోలీవుడ్ థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ ఫిల్మ్ అక్కడి జనాలను బాగానే ఆకట్టుకుంది. యోగిబాబు ఏ సినిమా చేసిన తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాడు. ఆయన డైలాగ్ డెలివరీ కి, ఇచ్చే హవా భావాలకు ఎవ్వరైనా ఫియా అవ్వాల్సిందే. ఇక ఈ సినిమాలో కూడా తనదైన సిగ్నేచర్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.ఇపుడు ఈ సినిమా తెలుగు ఓటీటీ లోకి అందుబాటులోకి రానుంది.  స్వదీస్‌ ఎమ్‌ఎస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటి వరకూ తమిళ్‌లో అందుబాటులో ఉంది. 

Also Read:-దీపావళి రేస్లో మాస్ కా దాస్..మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ అనౌన్స్!..విశ్వక్కి పోటీగా సాయి పల్లవి మూవీ

ఇపుడు బూమర్‌ అంకుల్‌ మూవీ తెలుగులో ‘ఆహా’ (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా జూలై 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని ఆహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. "తమాషా బూమర్ అంకుల్..మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి జూలై 20న ఆహాలో వస్తున్నాడు" అంటూ ట్వీట్ చేసింది. కాగా బూమర్ అంకుల్ తమిళ్ వెర్షన్ ఇప్పటికే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో యోగిబాబు, ఒలివా ప్రధాన పాత్రలు పోషించారు. రోబో శంకర్, సబా శేషు, తంగ దురై, బాలా, సతీశ్ మోహన్, ఎంఎస్ భాస్కర్, సోనా హైదర్ ఇతర పాత్రల్లో కనిపించారు. అంకా మీడియా పతాకంపై అన్బు, కార్తీక్ కే తలై నిర్మించిన ఈ సినిమాకు ధర్మ ప్రకాశ్, సంతన్ అనబజేగానే సంగీతం అందించారు.

కథేంటంటే:

నేసమ్‌ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులు. విదేశీ యువతి అయినా ఓవియా ను ఇష్టపడి పెళ్లిచేసుకుంటాడు. కానీ ఒకానొక సమయంలో.. భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నేసమ్‌ డిసైడ్ అవుతాడు. అయితే, తాను విడిపోవడానికి ఓ షరతుపై అందుకు అంగీకరిస్తుంది అమీ. మరి అందుకు గల ఆ కండిషన్‌ ఏంటి? ఇకపోతే, విదేశీ యువతి అమీతో నేసమ్‌కు ఎలా పరిచయం ఏర్పడింది? మరి మధ్యలో నేసమ్ విడాకులు ఎందుకు కోరుకున్నాడు? భర్తపై భార్య పగతీర్చుకోవాలని అనుకోవడం ఇలా కామెడీ ప్రధానంగా క్రేజీ  అంశాలతో సాగుతుంది.