
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. ఆదివారం (ఏప్రిల్ 20) కాన్పూర్ లో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే గాలి దిశలో మార్పులు చోటుచేసుకోవడం కొద్దిసేపటికే ల్యాండ చేయాల్సి వచ్చింది. బలమైన గాలులతో హెలికాప్టర్ ఎగరడంలో సమస్యలు తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. పరిస్థితిని అంచనా వేసిన పైలట్ హెలికాప్టర్ ఎగిరేందుకు ప్రతికూల పరిస్థితులను గమనించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అధికారులుఊపరిపిల్చుకున్నారు.
ప్రధాని మోదీ ఏప్రిల్ 24న కాన్పూర్ పర్యటనకు ముందే ఈ సంఘటన జరిగింది. ప్రధాని రాకకోసం వీలుగా చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ , సాంకేతిక విశ్వ విద్యాలయం మైదానంలో హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. ఆదివారం సీఎం యోగి ఆదిత్యానాథ్ మెట్రో ప్రాజెక్టు, విద్యుత్ ప్లాంట్ పురోగతిని సమక్షించేందుకు కాన్పూర్ వెళ్లగా ఈ ఘటన జరిగింది.
అంతకుముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక విధుల్లో భాగంగా నయాగంజ్ నుంచి కాన్పూర్‌లోని రావత్‌పూర్ స్టేషన్లకు మెట్రోలో ప్రయాణించారు. హెర్బర్ట్ బంధ నాలుగు లేన్ల రోడ్డు ప్రాజెక్టును పరిశీలించేందుకు యోగి గోరఖ్‌పూర్ వెళ్లారు. కొత్త రోడ్డు రవాణాను సులభతరం చేస్తుందని అన్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా రోడ్డు విస్తరణ, బలోపేతం ,కొత్త నాలుగు లేన్ల రోడ్లు ,ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి సారించి, గోరఖ్‌పూర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రూ.700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం ఆదిత్యనాథ్ ఆమోదించారు.