ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అర్హులందరికీ ఓటు హక్కు ఉండాలి
స్టేట్‌‌‌‌‌‌‌‌ ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌ యోగితా రాణా

నిజామాబాద్, వెలుగు : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని స్టేట్‌‌‌‌‌‌‌‌ ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోషల్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా సూచించారు. ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి ఏమైనా మార్పులు, చేర్పులను అధికారుల దృష్టికి తేవాలన్నారు. బుధవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఆమె పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, బీఎల్వోలతో, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించాలని సూచించారు. ఓటరు జాబితాను ముందుగానే గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులకు అందించాలన్నారు. దీనివల్ల జాబితాలో ఎప్పటికప్పుడు తప్పులను సరిదిద్దుకుంటూ, మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 2023  జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకుల పేర్లు, వివరాలను ఓటరు జాబితాలో చేర్పించాలన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లకు సంబంధించి వారి గురువు పేరును ఓటరు వివరాల్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి శశికళ, డీఆర్డీవో చందర్, ఆర్దీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు పవన్ పాల్గొన్నారు.

మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి కూడా కలిశారు. ఎమ్మెల్యే వెంట ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. 


బస్టాండ్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం

లింగంపేట, వెలుగు : లింగంపేట ఆర్టీసీ బస్టాండ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆర్ఎం ఉషారాణి చెప్పారు. బుధవారం ఆఫీసర్లు, స్థానిక నేతలతో కలిసి బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండాలని, సిమెంట్‌‌‌‌‌‌‌‌ పనులకు నీటితో క్యూరింగ్ సక్రమంగా చేయాలని కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బస్టాండ్‌‌‌‌‌‌‌‌ చుట్టూ కాంపౌండ్​వాల్​నిర్మాణానికి ప్రపోజల్స్ పంపిస్తున్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే ఆ పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం వెంట ఎంపీపీ గరీబున్నీసా బేగం, డీఈఈ శ్రీకాంత్, కామారెడ్డి డిపో మేనేజర్ మల్లేశం, ఏఈ సూర్యతేజ, ముదాం సాయిలు, నయీం, సాదిక్, రాజు పాల్గొన్నారు.

‘మిషన్ భగీరథ పేరుతో దోచుకున్నరు’

కమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: గత ప్రభుత్వాలు కట్టిన వాటర్ ట్యాంకులకు రంగులు వేసి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలకులు మిషన్ భగీరథ పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని బీజేపీ స్టేట్ లీడర్ ఏలేటి మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. ‘జనంతోనే మనం’లో భాగంగా బుధవారం మండలంలోని చౌటుపల్లి నుంచి ఉప్లూర్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బషీరాబాద్‌‌‌‌‌‌‌‌ గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసి మాట్లాడారు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక చేతితో పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్లే ఇచ్చి మరో చేతితో దానికి రెండితలు కరెంట్‌‌‌‌‌‌‌‌ చార్జిల పేరిట దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. రాష్ట్రంలో రాబయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, కమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండల ప్రెసిడెంట్ కట్ట సంజీవ్, బాల్కొండ, భీంగల్, మోర్తాడ్, ఎర్గట్ల, ముప్కాల్, మండలాల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు .

ఉపాధి కూలీలపై కేంద్రం కక్ష సాధింపు

ఎమ్మెల్యే హన్మంత్​షిండే ఆరోపణ

పిట్లం, వెలుగు : ఉపాధి కూలీలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఎమ్మెల్యే హన్మంత్​షిండే ఆరోపించారు. బుధవారం జరిగిన పెద్దకొడప్‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌ మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ ప్రతాప్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే చీఫ్‌‌‌‌‌‌‌‌ గెస్ట్‌‌‌‌‌‌‌‌గా హాజరయ్యారు. ఉపాధి హామీ చర్చలో కూలీల డబ్బులు రావడం లేదని తెలియడంతో ఎమ్మెల్యే స్పందించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కూలీలు ఆందోళన చెందవద్దని కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి పెండింగ్‌‌‌‌‌‌‌‌ డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆర్టీసీ చర్చలో ఆధికారులు రాక పోవడంతో బాన్సువాడ డిపో డీఎంతో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో మండలంలో 12 స్కూళ్లు ఎంపిక కాగా అందులో 11 స్కూళ్లలో పనులు పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. అనంతరం సీఎం రీలీఫ్​ ఫండ్‌‌‌‌‌‌‌‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, తహసీల్దార్ దశరథ్, సొసైటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ హన్మంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కోఆప్షన్ మెంబర్​ జాఫర్, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు 
పాల్గొన్నారు.

బీడీ పరిశ్రమ ఎత్తి వేసేందుకు కుట్ర
 

కామారెడ్డి, వెలుగు : బీడీ పరిశ్రమ ఎత్తి వేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్​అలీ ఆరోపించారు. బుధవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ, కరోనా టైంలో సేవలు అందించిన పార్టీ శ్రేణులు, వివిధ సంస్థల ప్రతినిధులకు షబ్బీర్​అలీ పౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 25 రోజుల్లో బీడీలపై జీఎస్టీ ఎత్తి వేస్తామన్నారు. అనంతరం ఇటీవల ప్రమాదవశాత్తు చనిపోయిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్త గెరిగంటి రాజయ్య ఫ్యామిలీకి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందించారు. అంతకుముందు మాచారెడ్డి మండలం భవానీపేట హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఫుడ్ పాయిజన్‌‌‌‌‌‌‌‌ అస్వస్థతకు గురై ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పొందుతున్న స్టూడెంట్లను షబ్బీర్​అలీ పరామర్శించారు. ఆయన వెంట డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రావు, పీసీసీ సెక్రటరీ ఇంద్రాకరణ్​రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, టౌన్, రూరల్ పార్టీ ప్రెసిడెంట్లు రాజు,  శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి,  బీమ్​రెడ్డి, గణేశ్​నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

నిధులు లేకుండా పనులు ఎలా చేయాలి 
 

నిజామాబాద్ రూరల్ (మోపాల్​), వెలుగు: గ్రామాలకు ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుంటే అభివృద్ధి పనులు ఎలా చేయాలని మోపాల్ మండలానికి చెందిన పలువురు సర్పంచులు ప్రశ్నించారు. బుధవారం ఎంపీపీ లత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించిన అనేక పనులకు ఆరు నెలలైనా బిల్లులు ఇవ్వలేదని, మళ్లీ కొత్త పనులు చేయాలంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు అటవీ భూముల్లో హద్దులు ఏర్పాటు చేసుకోవాలని, పట్టా భూములు, అసైన్డ్​భూముల్లో పంటలు సాగు చేసుకునే వారిని ఇబ్బంది పెట్టొద్దని పలువురు సభ్యులు కోరారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరిచి అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. వైస్ ఎంపీపీ అనిత, జడ్పీటీసీ కమల, ఎంపీడీవో లింగం పాల్గొన్నారు.