Yograj Singh: నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు.. ధోనీని ఎప్పటికీ క్షమించను: భారత క్రికెటర్ తండ్రి

Yograj Singh: నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు.. ధోనీని ఎప్పటికీ క్షమించను: భారత క్రికెటర్ తండ్రి

భారత మాజీ ఆల్ రౌండర్  యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్.. భారత ఆల్ టైం కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీపై గతంలో ఎన్నో విమర్శలు చేసిన యువీ తండ్రి.. తాజాగా మహేంద్రుడిపై తన కోపాన్ని ప్రదర్శించాడు. జీ స్విచ్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్.. మరోసారి తన కొడుకు యువరాజ్ సింగ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపించాడు. 

ఈ ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "ఎంఎస్ ధోనిని నేను క్షమించను. అతను మొత్తం క్రెడిట్ ను తీసుకుంటాడు. ధోనీ  చాలా పెద్ద క్రికెటర్. కానీ నా కొడుకుపై ఏం చేసాడనే ప్రతి విషయం ఇప్పుడు బయట పడుతుంది.అతన్ని నా జీవితంలో ఎప్పటికీ క్షమించను. నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే నా ఫ్యామిలీ అయినా నేను క్షమించను". అని యువీ తండ్రి ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. 

Also Read:శ్రీలంక చిత్తు

యువరాజ్ సింగ్  తన క్రికెట్ కెరీర్ కు త్వరగా రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఎంఎస్ ధోని కారణమని యోగరాజ్ సింగ్ కూడా ఆరోపించారు. ఇంకా నాలుగైదేళ్లు ఆడగలిగే నా కొడుకు జీవితాన్ని ధోని నాశనం చేసాడని..యువరాజ్ లాంటి కొడుకు అందరికీ పుట్టాలని నేను ధైర్యంగా చెబుతానని ఆయన అన్నారు. సచిన్, గంభీర్ లాంటి ఆటగాళ్లు కూడా మరో యువరాజ్ సింగ్ రాడని.. అతనికి భారత రత్న అవార్డు కు అర్హుడని ఆయన చెప్పుకొచ్చారు. 

యువరాజ్ సింగ్ 2000 నుండి 2017 వరకు మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 11,178 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు..  71 అర్ధ సెంచరీలు ఉన్నాయి. యువరాజ్ సభ్యుడిగా ఉన్నప్పుడు భారత్ 2022 లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ..  2007 లో టీ20 ప్రపంచ కప్.. 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. యువరాజ్ సింగ్ చివరిసారిగా భారత్ తరపున 2017 జూన్ లో వెస్టిండీస్‌పై మ్యాచ్ ఆడాడు.  2019లో అంతర్జాతీయ క్రికెట్‌ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.