
టీమిండియా ఆల్ టైం బెస్ట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో ఇంకా తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్ లో అంతంత మాత్రంగా రాణిస్తున్న అర్జున్.. అంతర్జాతీ క్రికెట్ లో అడుగు పెట్టాలంటే అత్యద్భుతంగా రాణించాల్సిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
అర్జున్ టెండూల్కర్ టీమిండియా ఎంట్రీ దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తుంది. అయితే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్.. అర్జున్ టెండూల్కర్ మరో క్రిస్ గేల్ కాగలడని అన్నారు. గతంలో అర్జున్‌కు శిక్షణ ఇచ్చిన యోగరాజ్ సింగ్ తన అనుభవాలను పంచుకున్నాడు. అతడిని బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టమని కోరినట్లు వెల్లడించాడు. సచిన్ వెళ్లి యువరాజ్‌ను శిక్షణ ఇవ్వమని అడిగితే అర్జున్ మరో క్రిస్ గేల్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. యోగరాజ్ మాట్లాడుతూ..
యోగరాజ్ మాట్లాడుతూ.."అర్జున్ విషయానికొస్తే నేను అతని బౌలింగ్ పై తక్కువ దృష్టి పెట్టి బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పాను. సచిన్ అడిగితే యువరాజ్ సింగ్ కాదనడు. సచిన్ కొడుకుకు యువరాజ్ మూడు నెలలు శిక్షణ ఇవ్వగలిగితే అతను తదుపరి క్రిస్ గేల్ అవుతాడని నేను పందెం వేస్తున్నాను. ఒక ఫాస్ట్ బౌలర్ తరచుగా గాయాలపాలైతే అతను సమర్థవంతంగా బౌలింగ్ చేయలేడు. అర్జున్‌ను కొంతకాలం యువరాజ్‌కు అప్పగించాలని నేను భావిస్తున్నాను" అని అతను క్రికెట్ నెక్స్ట్‌తో చెప్పాడు.
Also Read:-ఆర్సీబీ చేసినట్టు చేస్తే మనం ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు.. సన్ రైజర్స్‌కు హెడ్ కోచ్ సలహా
అర్జున్ ఇటీవలే జరిగిన దేశవాళీ క్రికెట్ లో అత్యుత్తమ ఫామ్‌లో లేడు. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో రెండు ఇన్నింగ్స్‌లలో 40 పరుగులు చేశాడు. బౌలింగ్ లో మూడు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో మూడు ఇన్నింగ్స్‌ల్లో 17 సగటుతో 51 పరుగులు చేశాడు. అయితే బౌలింగ్ లో అద్భుతంగా రాణించాడు. నాలుగు మ్యాచ్‌లలో 18.18 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. వీటిలో ఒకసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు. 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లలో కేవలం 21 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీసుకున్నాడు.
"Arjun Tendulkar can become the next Chris Gayle," says Yograj Singh! 😯🏏#Cricket #Gayle #Arjun #Yograj pic.twitter.com/7f2gYW8dlt
— Sportskeeda (@Sportskeeda) April 24, 2025