ఏపీ నుంచి 120 దేశాలకు యోకోహామా టైర్లు!

ఏపీ నుంచి 120 దేశాలకు యోకోహామా టైర్లు!

సీఎం జగన్ హయాంలో ప్రపంచ ప్ర‎ఖ్యాత సంస్థలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యోకోహామా..విశాఖ సమీపంలోని అచ్యుతాపురంలో రూ. 679 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

రూ. 679 కోట్లతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో యోకోహామా గ్రూప్‌ యూనిట్‌ను ప్రారంభించనుంది. ఈ యూనిట్‌లో 3.7 కేజీల నుంచి 1.26 కేజీల బరువు ఉండే భారీ టైర్లను తయారు చేస్తారు. ఏపీలో తయారైన ఈ టైర్లను యోకోహామా సంస్థ120కు పైగా దేశాలకు ఎగుమతి చేయనుంది. యోకోహామా విశాఖ ప్లాంట్‌ ద్వారా దాదాపు 10, 000 మంది స్థానికులకు ఉద్యోగాలు లభించనున్నాయి.