మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్ల నష్టానికి కారణం బిల్గేట్సే.. ఆండ్రాయిడ్ కో ఫౌండర్ ఆరోపణ

మైక్రోసాఫ్ట్ కోఫౌండ్ బిల్ గేట్స్ పై సంచలన ఆరోపణ చేశారు ఆండ్రాయిడ్ కో ఫౌండర్. ‘‘మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్ల నష్టానికి కారణం మీరే.. మీ తప్పుడు నిర్ణయాల వల్లే మైక్రోసాఫ్ట్ 400 బిలియన్ డాలర్లు నష్టపోయింది’’అని ఆండ్రాయిడ్ కో ఫౌండర్ రిచ్ మైనర్ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. 

ఐఫోన్ మార్కెట్ క్యాప్చర్ చేయకముందే మైక్రోసాఫ్ట్ కు మంచి అవకాశం ఉండే. మైక్రో సాఫ్ట్ లో ఆండ్రాయిడ్ వినియోగం పెంచి ఉంటే ఆపిల్ ఐఫోన్ కంటే టాప్ లో మైక్రోసాఫ్ట్ ఫోన్ ఉండేది. కానీ బిల్ గేట్స్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల 400 కోట్ల డాలర్లు ఈ రోజు కంపెనీ లాస్ అయ్యిందని తెలిపాడు ఆండ్రాయిడ్ కో ఫౌండర్ రిచ్ మైనర్.

Also Read : బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు

ఆండ్రాయిడ్ ద్వారా మైక్రో సాఫ్ట్ ఫోన్ ను తీసుకొద్దామని.. దాని కోసం అన్ని  టెక్కికల్ డెవలప్ మెంట్స్ చేశామని.. కానీ తమ మాట అప్పుడు బిల్ గేట్స్ వినలేదని అన్నారు. మైక్రోసాఫ్ట్ ఫోన్ లో విండోస్  వినియోగించడం తప్పుడు నిర్ణయమని తెలిపారు. విండోస్ వాడటం వల్లనే మైక్రోసాఫ్ట్ వెనక బడిందని, దీనంతటికీ కారణం బిల్ గేట్స్ తీసుకున్న తప్పుడు నిర్ణయమని విమర్శించారు.