మైనార్టీల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్ కు చెందిన జునైద్, నసీర్లను చంపిన వారిని బీజేపీ ఎందుకు ఎన్ కౌంటర్ చేయడం లేదని ప్రశ్నించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు దేనికని ప్రశ్నించారు. న్యాయస్థానాలను మూసి వేయండన్నారు.
మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ ల విషయంలో కేంద్రం ఆంక్షలు విధిస్తోందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. చట్టపరమైన పరిపాలనను నిర్వీర్యం చేయాలను చూస్తున్నారని విమర్శించారు. మజ్లిస్ సేవకుడిగా అసదుద్దీన్ ఒవైసీ ఉండేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుందన్నారు. తమ సహాకారం లేకుండానే తెలంగాణ ఇంతలా అభివృద్ధి చెందుతోందా అని తర్జన భర్జన పడుతున్నారని చెప్పారు.