ఆధార్ కార్డ్‌‌‌‌లో  ఫొటో మార్చండి ఇలా...

న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్​అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెబ్సైట్ ద్వారా ఆధార్​కార్డు చిరునామా, ఫోన్ నంబర్, చిరునామా  ఫోటో వంటి వాటిలో మార్పులు చేసుకోవచ్చు.  కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్, 12 అంకెల గుర్తింపు సంఖ్యకు మార్పులు చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ కేంద్రాలకు వెళ్లినా పని జరుగుతుంది. ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లోని వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయడానికి కార్డ్ హోల్డర్లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో లేదా ఆధార్ ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లలో అప్‌‌‌‌‌‌‌‌డేటింగ్ ఫీజును కూడా చెల్లించాలి. ఒక్కో సేవకు ఒక్కో రకమైన ఫీజు ఉంటుంది. కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌కి సంబంధించిన అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించిన తర్వాత వారికి రసీదు నంబర్ అందిస్తారు. ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లోని వివరాలను మార్చడానికి గరిష్టంగా 90 రోజుల సమయం పడుతుంది. వివరాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసిన తర్వాత, కార్డ్ హోల్డర్లు అధికారిక యూఐడీఏఐ పోర్టల్ నుండి కొత్త కాపీని డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకోవచ్చు లేదా డాక్యుమెంట్  ప్రింటెడ్ వెర్షన్‌‌‌‌‌‌‌‌ను ఆర్డర్ చేయవచ్చు.

ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫోటోను ఎలా మార్చాలో తెలుసుకుందాం..

స్టెప్ 1: మీ ఆధార్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయడానికి https://uidai.gov.in/my-aadhaar/update-aadhaar.html   వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాలి. 
స్టెప్ 2: ఆధార్ ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫారమ్‌‌‌‌‌‌‌‌లో సంబంధిత సమాచారాన్ని నమోదు చేయండి.
స్టెప్ 3: ఫారమ్‌‌‌‌‌‌‌‌లో అడిగిన వివరాలను పూర్తి చేసి, సమీపంలోని ఆధార్ ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో అందించండి.
స్టెప్ 4: కేంద్రంలోని ఏజెంటు కొత్త ఫోటోగ్రాఫ్‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేసే ముందు సంబంధిత సమాచారాన్ని అందజేస్తారు.
స్టెప్ 5:మీ ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లో మీ ఫోటోను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయడానికి మీరు రూ. 100తో పాటు జీఎస్టీనిని చెల్లించాలి.
స్టెప్ 6: ఫీజు చెల్లింపు తర్వాత  అప్‌‌‌‌‌‌‌‌డేట్ రిక్వెస్ట్ నంబర్‌‌‌‌‌‌‌‌తోపాటు రసీదు స్లిప్‌‌‌‌‌‌‌‌ను ఇస్తారు.