చాట్​జీపీటీతో డబ్బులు ఎలా సంపాదించ్చో తెలుసా?

 చాట్​జీపీటీతో డబ్బులు ఎలా సంపాదించ్చో తెలుసా?

న్యూఢిల్లీ: టెక్నాలజీ ప్రపంచంలో చాట్​జీపీటీ పెద్ద సంచలనమే సృష్టించింది. స్టూడెంట్స్​కు హోమ్​వర్క్​ చేయడం, సాఫ్ట్​వేర్​ కోడింగ్​ రాయడం, ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం, వంటలను నేర్పడం, ఇంటర్వ్యూలు చేయడం వంటి ఎన్నో పనులు చేయగలుగుతోంది. అచ్చం మనిషిలాగే మనం అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవడం, జవాబులు ఇవ్వడం దీని స్పెషాలిటీ. దీంతో ఈ ఏఐ చాట్​బాట్​కు విపరీతమై గిరాకీ పెరిగింది. ఉద్యోగులు చేయగల పనులను ఇది ఈజీగా చేస్తుండటంతో ఇతర కంపెనీలూ ఇలాంటి చాట్​బాట్​ను తేవడంపై ఫోకస్​ చేశాయి.  లేటెస్ట్ న్యూస్​ ఏమిటంటే చాట్​జీపీటీ సాయంతో డబ్బులు కూడా సంపాదించవచ్చు. అది ఎలాగో చూద్దాం.

పెయిడ్​ కంటెంట్‌‌‌‌ను రాయండి

ప్రొడక్టులు, బ్రాండ్‌‌లు,  వెబ్‌‌సైట్లకు క్రియేటివ్​కంటెంట్​చాలా అవసరం. దీనికి డిమాండ్ చాలా పెరిగింది. ఇలాంటి పనుల కోసం కూడా చాట్​జీపీటీని ఉపయోగించవచ్చు. తాము చెప్పిన కంటెంట్‌‌పై ఫీడ్​బ్యాక్  ఇవ్వాలని చాట్‌‌బాట్‌‌ను అడగవచ్చు.  కావాల్సిన విధంగా ఆర్టికల్​ను రూపొందించడానికి ఈ చాట్​బాట్​ సాయంతో కంటెంట్‌‌ను మార్చుకోవచ్చు.

 అఫిలియేట్​  ​మార్కెటింగ్


చాట్​జీపీటీ ఉపయోగించి అఫిలియేట్ మార్కెటింగ్‌‌ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.  అఫిలియేట్​ మార్కెటింగ్ సాయంతో ప్రొడక్టులను, సేవలను,  బ్రాండ్‌‌లను ఏదైనా ప్లాట్‌‌ఫారమ్‌‌లో ప్రచారం చేయవచ్చు.  ఆ ప్లాట్‌‌ఫారమ్  నుంచి  కమీషన్‌‌ను తీసుకోవచ్చు.  చాట్​జీపీటీని ఉపయోగించే ముందు ఆర్టికల్, ఆడియో, వీడియో వంటి ఒక మీడియంను ఎంచుకోవాలి. మీడియంను నిర్ణయించుకున్న తర్వాత,  ఆర్టికల్స్​కు రెస్పాన్స్​లను  పొందడానికి చాట్​జీపీటీని ఉపయోగించవచ్చు. వీడియోలు,  ఆడియోల కోసం మీకు కొన్ని మంచి ఐడియాలు కావాలి. యూట్యూబ్​ వీడియో లేదా పాడ్‌‌క్యాస్ట్ కోసం థంబ్‌‌నెయిల్ ఐడియా, టైటిల్​ ఐడియాలను తయారు చేయాలని కూడా ఏఐ చాట్‌‌బాట్‌‌ని అడగవచ్చు. ఇలా చేస్తే కొన్ని బెస్ట్ ఐడియాలను పొందొచ్చు.

కంటెంట్ ఎడిటింగ్​ సర్వీసును అందించడం

రైటింగ్​ సర్వీసును అందించడంతో పాటు,  ఎడిటింగ్ సేవలను అందించడానికి సాఫ్ట్‌‌వేర్‌‌ను ఉపయోగించవచ్చు. చాట్​జీపీటీని ఉపయోగించి ఆర్టికల్స్​, బ్లాగ్ పోస్ట్‌‌లను, కంటెంట్‌‌ను సులభంగా మన అవసరాలకు తగ్గట్టుగా, క్రియేటివ్​గా మార్చుకోవచ్చు. 

రీసెర్చ్​చేయండి

అనేక సమస్యలపై రాయడమే కాకుండా, వివిధ   అంశాలపై పరిశోధన చేయడానికి చాట్​జీపీటీని ఉపయోగించవచ్చు. కావలసిన సమాధానాలను పొందడానికి టాపిక్‌‌ని అర్థం చేసుకోవడానికి చాట్​జీపీటీని తగిన ప్రశ్నలు అడగాలి.

ఎస్‌ఈఓ కోసం కీవర్డ్స్​ కనిపెట్టాలి
 
చాట్​జీపీటీతో సంబంధిత కీవర్డ్స్ అడగడం ద్వారా ఇతర కంటెంట్ ప్రొడక్షన్​ సంస్థలకు సెర్చింజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్‌ఈఓ) సేవలను కూడా అందించవచ్చు.  ఇంటర్నెట్‌‌‌‌లో మన కంటెంట్ ఎక్కువగా కనిపించేలా చేయడానికి కీవర్డ్స్ ను, టైటిల్స్​ను, మెటా డిస్క్రిప్షన్లను తయారు చేయవచ్చు.  కోరుకున్న టాపిక్​ కోసం టైటిల్, ఇంట్రో, కీవర్డ్స్ వంటివాటిని చాట్​జీపీటీ నుండి  అడగాలి.