బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ మంచి అవకాశం. సరైన ప్లానింగ్‌తో సిద్ధమైతే కొలువు కొట్టడం సులువే. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,455 పీవో/ మేనేజ్‌మెంట్ ట్రెయినీల ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో 11 జాతీయ స్థాయిలో ఉన్న బ్యాంకులు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం..
మొత్తం 4,455 ఖాళీల్లో (ఎస్సీ- 657, ఎస్టీ- 332, ఓబీసీ- 1185, ఈడబ్ల్యూఎస్- 435, యూఆర్- 1846) ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా: 885, కెనరా బ్యాంక్: 750, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2000, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 260, పంజాబ్ నేషనల్ బ్యాంక్: 200, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్: 360, యూకో బ్యాంక్: ఎన్‌ఆర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఎన్‌ఆర్, బ్యాంక్ ఆఫ్ బరోడా: ఎన్‌ఆర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎన్‌ఆర్, ఇండియన్ బ్యాంక్: ఎన్‌ఆర్.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ మూడు పద్ధతుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడంచెల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ అక్టోబర్ లో జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్‌లో నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలను జనవరి లేదా ఫిబ్రవరి 2025లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
అర్హతలు: వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, అంగవైకల్యం ఉన్నవారికి పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అర్హత ఉండాలి. ఆగస్టు22 నాటికి డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్: ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్‌లో మొత్తం మూడు సబ్జెక్టులు ఉంటాయి. అవి జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటి ప్రతి సబ్జెక్టుకు సమయం సేపరేట్‌గా ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 20 నిమిషాల డ్యురేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు, 30 మార్కులు. కనీసం క్వాలిఫై మార్కులు సాధించాలి. కనీసం క్వాలిఫై మార్కులు ఐబీపీఎస్ నిర్ణయిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు, 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. ఈ సబ్జెక్టులో కనీస అర్హత మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్‌లో ప్రతి సబ్జెక్టుకు సపరేట్ కటాఫ్ మార్కులు ఉంటాయి. ప్రతిదాంట్లో క్వాలిఫై అవ్వాలి. లేకుంటే మెయిన్స్‌కు అర్హత ఉండదు.
మెయిన్స్ ప్లాన్: మెయిన్స్ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. వీటితో పాటు ఇంగ్లిష్ లెటర్ రైటింగ్, ఎస్సేకు 25 మార్కులు ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో మొత్తం నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. అవి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్, ఎకానమి, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ ఉంటాయి. మొయిన్స్ పరీక్షకు మూడు గంటల సమయం ఉంటుంది. లెటర్ రైటింగ్ అండ్ ఎస్సేకు 30 నిమిషాలు ఉంటుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు నుంచి 45 ప్రశ్నలకు 60 మార్కులు ఉంటాయి. జనరల్ ఎకానమి, బ్యాంకింగ్ అవేర్నెస్ సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు వస్తాయి. ఇంగ్లిష్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. డేటా ఎనాలసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు వస్తాయి. లెటర్ రైటింగ్, ఎస్సేకు 25 మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్కులు ఉంటుంది.
ఇంటర్వ్యూ ప్రాసెస్: ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉంటాయి. ఒపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో కనీస అర్హతగా 40 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు 35 శాతంగా ఉంది. అభ్యర్థి ఫైనల్ స్కోర్ మెయిన్స్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులపై ఆధారపడి ఉంటుంది. మెయిన్స్‌కు 80శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజకుకాకుంటే ఫైనల్ సెలెక్షన్‌కు అర్హత కోల్పోతారు.
ఉద్యోగ ఖాళీలు: మొత్తం పీవో, మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీలు 6432 ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీ 2596, ఈడబ్ల్యూఎస్‌లో 616, ఓబీసీ కేటగిరీలో 1741, ఎస్సీ కేటగిరీలో 996, ఎస్టీ విభాగంలో 483 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకుల వారీగా పరిశీలిస్తే కెనరా బ్యాంక్‌లో అత్యధికంగా 2500 ఖాళీలు ఉండగా ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఇండియాలో 2094, యూకో బ్యాంక్‌లో 550, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 535, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 500, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 253 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ఈ సబ్జెక్టు మీద ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రిపీటెడ్ ప్రశ్నలు కాగా రెండు ఒక సంవత్సరం ముందు వరకు కొత్తగా కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులో వచ్చిన కొత్త అంశాలపై అడిగే అవకాశం ఉంది. గత సంవత్సర కాలంలో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలలో భారీ మార్పులు వచ్చాయి. దాదాపు 90 శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్కు సంబంధించినవే అడుగుతున్నారు.
జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్: ఈ సబ్జెక్టు కొంచెం విస్తృతంగా కనిపించినా ప్రీవియస్ పేపర్స్ పరిశీలిస్తే ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుస్తుంది. డివైడ్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఎకానమి అంటే పూర్తిగా ఇండియన్ ఎకానమి కాకుండా బ్యాంకింగ్ లింక్ కలిగిన ఎకానమీ మీదే ఫోకస్ చేయాలి. ఆర్బీఐ పాలసీలు, బ్యాంకిగ్ వ్యవస్థలో కొత్తగా వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ఎకనామిక్ టైమ్స్, టైమ్ ఆఫ్ ఇండియా, బిజినెస్ లైన్స్ లాంటి పత్రికలు చదివితే పట్టు సాధించవచ్చు.
నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయసు 1 ఆగస్టు -2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 చోట్ల పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అవి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, వరంగల్ లో సెంటర్స్ ఉన్నాయి.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ అక్టోబర్‌లో, మెయిన్స్ నవంబర్‌లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించాలి.
సక్సెస్ సీక్రెట్: బ్యాంక్ ఉద్యోగాల్లో విజయం సాధించాలంటే రెండు అంశాలు గుర్తుంచుకోవాలి. ఒకటి ప్రాక్టీస్, రెండు ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించాలి. పీవో ఉద్యోగానికి జీరో నాలెడ్జ్‌తో మొదలుపెట్టినా 9 నెలల నుంచి సంవత్సర కాలంలో ఉద్యోగం సాధించవచ్చు. సబ్జెక్టు మీద అవగాహన ఉన్నవారు ప్రతి రోజు 4 గంటలు ప్రాక్టీస్‌కు, రెండు గంటలు ఇంగ్లీష్ పేపర్ చదవడానికి కేటాయించాలి.
బ్యాంకులో ఉద్యోగం సాధించాలంటే వేగం, కచ్చితత్వం చాలా ముఖ్యం. ఈ ఉద్యోగాల్లో దాదాపు 80 శాతం ప్రశ్నలు ప్రీవియస్ పేపర్స్ నుంచే అవకాశం ఉంది. అందుకే మోడల్ పేపర్స్‌తో పాటు పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్‌తో ఎగ్జామ్‌లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో అర్థం అవుతుంది.