
గవర్నర్లు పరిశీలన కోసం పంపిన బిల్లులపై రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నిర్ధిష్ట గడువు విధించిన విషయం తెలిసిందే. బిల్లులపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ తీవ్రంగా విమర్శించారు. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో కార్యనిర్వాహక,శాసనసభలకు కేటాయించిన పాత్రల్లోకి న్యాయవ్యవస్థ అడుగుపెట్టడం ఎప్పుడూ లేదని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం..గవర్నర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతికి బిల్లును రిజర్వ్ చేసినప్పుడు మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడు గవర్నర్ రాష్ట్ర బిల్లులకు ఆమోదం తెలపకుండా నిలిపివేయడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. రాష్ట్రపతికి పాకెట్ వీటో లేదని సకాలంలో అనుమతివ్వాలి లేదా తిరస్కరణ ఏదో ఒక చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
►ALSO READ | వదిలిపెట్టి వెళ్లడమే మీ ఏకైక బంధం.. పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇండియా స్ట్రాంగ్ రిప్లై