రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?

రంజీ ట్రోఫీలో కోహ్లీ రోజుకు ఎంత సంపాదిస్తాడు..?

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతుండటం అభిమానుల్లో ఉత్సాహం క్రియేట్ చేస్తోంది. అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడుతూ కోట్లలో సంపాదించే కోహ్లీ.. రంజీ మ్యాచ్ ఆడితే ఎంత సంపాదిస్తాడనే డౌట్ అందరిలో నెలకొంది. ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైన ప్లేయర్లను దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందిగా బీసీసీఐ (BCCI) నిబంధన విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతుండటం ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచింది.

రంజీ ట్రోఫీ సాలరీ స్ట్రక్చర్ ఈ కింది విధంగా ఉంది:

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 40 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడిన ప్లేయర్లకు రోజుకు రూ.60 వేలు చెల్లిస్తారు. అదేవిధంగా 21-40 గేమ్స్ మధ్య ఆడిన వారికి రూ.50 వేలు ఇస్తారు. ఇక 20 మ్యాచ్ ల కంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు 40 వేలు చెల్లిస్తారు. టీమ్ లో ఉండి గేమ్ ఆడకుండా స్టాండ్ బై లో ఉన్న ప్లేయర్లకు 20 నుంచి 30 వేలు ఇస్తారు. 

ఒక్క మ్యాచ్ కు కోహ్లీ సాలరీ ఎంత?

అయితే కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్ లు, 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడారు. దీంతో కోహ్లీకి రంజీ మ్యాచ్ లో రోజుకు రూ.60 వేలు చెల్లించనున్నారు. నాలుగు రోజుల మ్యాచ్ కావడంతో 2 లక్షల 40 వేల రూపాయలు అందుతాయి. ఒకవేళ మ్యాచ్ 3 రోజుల్లోనే పూర్తయితే కోహ్లీ కి 1 లక్షా 80 వేల రూపాయలు సాలరీ కింద అందుతాయి.