వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన కిషన్

వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టిన కిషన్

49 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ.. 85 బాల్స్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ.. 126 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే దోసౌ! యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్(131 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 24 ఫోర్లు, 10 సిక్సర్లతో 210) షాన్‌‌‌‌‌‌‌‌దార్‌‌‌‌‌‌‌‌ ఆట ఇట్ల సాగింది. ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ బుడ్డోడు చాన్స్​ రాగానే తడాఖా చూపెట్టాడు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ ప్లేస్​లో బరిలోకి దిగిన ఈ జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ తన పవర్‌‌‌‌‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌తో  వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ను ఫిదా చేశాడు. తొలి రెండు వన్డేల్లో మన స్టార్లను వణికించిన బంగ్లా బౌలర్లకు డే టైమ్‌‌‌‌‌‌‌‌లో చుక్కలు చూపెట్టాడు. ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌ షాట్లతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన ఈ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ వన్డే ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీతో వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (91 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 113) మూడేండ్ల తర్వాత వంద కొట్టడంతో మూడో వన్డేలో ఇండియా భారీ విక్టరీతో ఊరట దక్కించుకుంది. 

చట్టోగ్రామ్: యంగ్​ బ్యాటర్​ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌  టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో మెరిపించాడు. అతని డబుల్‌‌‌‌‌‌‌‌ ధమాకాకు తోడు విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ సెంచరీ  దంచడంతో శనివారం జరిగిన మూడో వన్డేలో ఇండియా 227 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్​ను చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో గెలిచిన బంగ్లా 2-–1తో సిరీస్‌‌‌‌‌‌‌‌ గెలుచుకోగా.. ఈ విక్టరీతో టీమిండియాకు ఉపశమనం దక్కింది. ఈ వన్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన ఇండియా తొలుత 50 ఓవర్లలో 409/8 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 34 ఓవర్లలో 182కే కుప్పకూలింది. షకీబ్‌‌‌‌‌‌‌‌ (43) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. శార్దూల్‌‌‌‌‌‌‌‌ 3, అక్షర్‌‌‌‌‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌ చెరో  రెండు వికెట్లు తీశారు.  ఇషాన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌ అవార్డులుదక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇదే గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 14 నుంచి జరుగుతుంది.

దంచుడే దంచుడు

సీనియర్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ధవన్‌‌‌‌‌‌‌‌ (3) మరోసారి ఫెయిలైనా ఇషాన్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ ధమాకాతో ఇండియా భారీ స్కోరు చేసింది. మూడో ఓవర్లో రెండు ఫోర్లతో మొదలైన అతని హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఔటయ్యే 36వ ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకూ సాగింది. కోహ్లీ కుదురుకునేందుకు కాస్త టైమ్‌‌‌‌‌‌‌‌ తీసుకోగా.. ఇషాన్‌‌‌‌‌‌‌‌ మాత్రం స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. పేసర్‌‌‌‌‌‌‌‌, స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అన్న తేడా లేకుండా  హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అఫిఫ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌తో  కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తను టాప్‌‌‌‌‌‌‌‌ గేర్​లోకి వచ్చేశాడు. షకీబ్‌‌‌‌‌‌‌‌, ఎబాదత్‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసి వెంటవెంటనే ఆరు సిక్సర్లు బాదేశాడు. దాంతో, 103  బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 150 మార్కు దాటాడు. ఆపై మరింత విజృంభించిన ఇషాన్‌‌‌‌‌‌‌‌ ఇంకో 24  బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే 200 మార్కు అందుకున్నాడు. చాలా ఓవర్లు మిగిలుండగా అతని జోరు చూస్తుంటే ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేస్తాడేమో అనిపించింది. కానీ, తస్కిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన ఇషాన్‌‌‌‌‌‌‌‌ అదే ఊపులో ఇంకో షాట్‌‌‌‌‌‌‌‌ ఆడి బౌండ్రీ దగ్గర లిటన్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో  అద్భుత ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు తెరపడింది. కాసేపటికే ఎబాదత్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో కోహ్లీ (85 బాల్స్) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్లకు 339/3తో నిలిచిన ఇండియా ఈజీగా 450 చేస్తుందనిపించింది. కానీ, వరుస ఓవర్లలో కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (8), కోహ్లీని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన ఎబాదత్‌‌‌‌‌‌‌‌, షకీబ్‌‌‌‌‌‌‌‌  టీమిండియాకు బ్రేకులు వేశారు. చివర్లో అక్షర్​ (20),  సుందర్‌‌‌‌‌‌‌‌ (37) రాణించడంతో ఇండియా 400 మార్కు దాటింది.


126    వన్డేల్లో (126 బాల్స్)ఫాస్టెస్ట్‌‌ డబుల్‌‌ సెంచరీ చేసిన ప్లేయర్​ ఇషాన్.  2015లో జింబాబ్వేపై 138 బాల్స్‌‌లో క్రిస్‌‌ గేల్‌‌ చేసిన రికార్డును బ్రేక్‌‌ చేశాడు.

1  కెరీర్‌‌‌‌లో తొలి సెంచరీనే డబుల్‌‌ సెంచరీగా మార్చిన ఏకైక క్రికెటర్‌‌ ఇషాన్‌‌ కిషన్​.

9  ఇషాన్‌‌‌‌ కిషన్ తన 9వ ఇన్నింగ్స్‌‌లోనే డబుల్‌‌ సెంచరీ అందుకున్నాడు. రోహిత్‌‌ తన 103వ ఇన్నింగ్స్‌‌లో ఫస్ట్‌‌ డబుల్‌‌ సెంచరీ కొట్టగా, సెహ్వాగ్‌‌ 234వ ఇన్నింగ్స్‌‌లో, సచిన్‌‌ 431వ ఇన్నింగ్స్‌‌లో డబుల్‌‌ సాధించాడు.

72 అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 72వ సెంచరీ. ఎక్కువ సెంచరీలు చేసిన లిస్ట్​లో రికీ పాంటింగ్​ (71)ను దాటి రెండో ప్లేస్​కు వచ్చాడు.  సచిన్​ 100 సెంచరీలతో టాప్​లో ఉన్నాడు.

1  ఇషాన్​ 24 ఏండ్ల 145 రోజుల వయసులో వన్డేల్లో డబుల్‌‌ సెంచరీ చేసిన యంగెస్ట్‌‌ ప్లేయర్‌‌గా నిలిచాడు. 

290 సెకండ్‌‌‌‌ వికెట్‌‌కు కోహ్లీ, ఇషాన్‌‌ చేసిన పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బంగ్లాదేశ్‌‌పై ఏ వికెట్‌‌కైనా హయ్యెస్ట్‌‌.