నేషనల్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌9 చెస్ చాంప్‌‌‌‌‌‌‌‌ నిదిశ్‌‌‌‌‌‌‌‌

నేషనల్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌9 చెస్ చాంప్‌‌‌‌‌‌‌‌ నిదిశ్‌‌‌‌‌‌‌‌

పుణె : తెలంగాణకు చెందిన యంగ్ చెస్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిదిశ్‌‌‌‌‌‌‌‌ శ్యామల్‌‌‌‌‌‌‌‌ నేషనల్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–9 చెస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. గురువారం జరిగిన ఓపెన్‌‌‌‌‌‌‌‌ సెక్షన్ చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో నిదిశ్‌‌‌‌‌‌‌‌ 63 ఎత్తుల్లో వెస్ట్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓయిషిక్‌‌‌‌‌‌‌‌ మొండల్‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు. దాంతో మొత్తం 9.5 పాయింట్లతో అగ్రస్థానంతో స్వర్ణ పతకం గెలిచాడు. ఐదో క్లాస్ స్టూడెంట్ అయిన నిదిశ్‌‌‌‌‌‌‌‌ ఇది వరకు నేషనల్ అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌7 చాంపియన్‌‌‌‌‌‌‌‌గా కూడా నిలిచాడు.

గర్ల్స్‌‌‌‌‌‌‌‌ విభాగంలో  రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన కియన్నా పరిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 66 ఎత్తుల్లో ఐశ్వి సింగ్‌‌‌‌‌‌‌‌ (గుజరాత్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి పది పాయింట్లతో టైటిల్ సొంతం చేసుకుంది. నిదిశ్‌‌‌‌‌‌‌‌, కియన్న ట్రోఫీలతో పాటు చెరో రూ. 50 వేల ప్రైజ్‌‌‌‌‌‌‌‌మనీ కూడా అందుకున్నారు.