హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం : 30 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ మృతి

హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం : 30 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ మృతి

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హిట్ 3: ది థర్డ్ కేస్. ఈ సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. 30 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ మృతి చెందింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ లో జరుగుతోంది.

అక్కడ పలు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ మువీ చిత్ర బృందంలో ఒకరైన యువ సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ (KR Krishna) తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎంతో భవిష్యత్తు ఉన్న 30 ఏళ్ళ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ చనిపోవడంతో హిట్ 3 చిత్ర బృందానికి భారీ షాక్ తగిలింది.

కృష్ణ కెఆర్.. హిట్ 3 చిత్ర సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గీస్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అకస్మాత్తుగా ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఆమెను శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అయితే, కృష్ణ KR కోలుకుంటుందని వార్తలు వచ్చినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు సమాచారం. చిన్న వయస్సులోనే కృష్ణ కెఆర్ చనిపోవడంతో తన కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

కృష్ణ అంత్యక్రియలు ఆమె స్వస్థలమైన కేరళలోని పెరుంబవూరులో నిర్వహించనున్నారు. ఈ విషాద వార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ కృష్ణ మరణంపై ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.  "మా ప్రియమైన సినిమా సభ్యురాలు కృష్ణ KR అకాల మరణం గురించి మీకు తెలియజేసేందుకు చాలా బాధగా ఉంది. ఆమె కాశ్మీర్‌లో షూటింగ్‌లో ఉండగా ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు కారణంగా మరణించింది. కృష్ణ ఒక నిష్ణాతురాలు. సినిమాటోగ్రాఫర్ మరియు WCC యొక్క చురుకైన సభ్యురాలు, ఆమె ప్రతిభ, అభిరుచి మరియు సామూహిక మరియు చలనచిత్రానికి ఆమె చేసిన కృషి మెచ్చుకోదగినది.  తాను ఎల్లప్పుడూ అపారమైన గౌరవం మరియు ప్రశంసలతో గుర్తుంచుకోబడుతుంది" అని పోస్ట్ ద్వారా వెల్లడించారు.