- మూడు రోజుల కింద ఎరుగండ్లపల్లిలో గోల్డ్చైన్తెంపుకెళ్లిన యువతీయువకుడు
- ఇద్దరూ హైదరాబాద్‌వాసులే
- 3.5 గొలుసు,1.5 తులాల నల్లపూసల తాడు స్వాధీనం
కొండమల్లేపల్లి (మర్రిగూడ), వెలుగు: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న జంటను అరెస్ట్‌చేసినట్టు నల్గొండ జిల్లా నాంపల్లి సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎస్సై రంగారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మూడు రోజుల కింద మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లిలో టూ వీలర్‌పై వచ్చిన నిందితులు సాతు సునీత మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ చోట సీసీ ఫుటేజీలో దొరికిన స్నాచర్ల జంట ఫొటోను పోలీసులు సర్క్యులేట్చేశారు. వారిని పట్టుకోవడానికి స్పెషల్టీమ్స్ను రంగంలోకి దింపారు. ఆదివారం మర్రిగూడ పరిధిలోని సరంపేట ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూటీపై యువకుడు, యువతి వచ్చారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు.
బెట్టింగులకు అలవాటు పడి...
చైన్ స్నాచింగ్ చేసిన నిందితులిద్దరిని హైదరాబాద్‌లోని సంతోష్ నగర్‌కు చెందిన సభావాత్ వెంక టేశ్, సభావాత్ కుమారి గా గుర్తించారు. సభావత్కుమా రికి వివాహమైంది. వీరు బెట్టింగ్ లు, వ్యసనాలకు అలవాటు పడి పలు స్నాచింగ్స్చేస్తున్నారు. 3.5తులాల బంగారుగొలుసు,1.5 తులాల నల్లపూసల తాడు, నలుపు రంగు స్కూటీ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఎస్సై రంగారెడ్డి, సిబ్బందిని నల్గొండ ఎస్పీ చందన దీప్తి, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు అభినందించారు.