ఘోరం: పెళ్ళికి వెళ్లొస్తుంటే లారీ గుద్దేసింది.. యువజంట మృతి..

ఏపీలో దారుణం చోటు చేసుకుంది.. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న యువజంట అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్ర గాయాలైన మరో మహిళ ఆస్పత్రికి తరలించే లోపు మరణించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తాడిపత్రి మండలం గన్నెవారిపల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి వివాహం నిమిత్తం తన భార్య ప్రమీల అత్త వెంకటమ్మ లతో కలిసి కడపకు బయలుదేరి వెళ్లారు. వివాహం చూసుకొని తిరిగి తాడిపత్రి కి వస్తున్న సమయంలో వంగనూరు సమీపంలో కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతాపరెడ్డి ( 22 ), ప్రమీలలు ( 21 ) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన తీవ్రంగా గాయపడిన వెంకటమ్మ ఆసుపత్రికి తరలించే మార్గంలో మరణించింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.