
- ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో ఘనంగా వేడుకలు
బషీర్‌బాగ్/పద్మారావునగర్, వెలుగు: వైద్య వృత్తిని వ్యాపారంగా కాకుండా సామాజిక దృక్పథంతో చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ 174వ స్నాతకోత్సవానికి శుక్రవారం ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. 2019 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
మెడిసిన్ పూర్తి చేసుకొని, ఇష్టమైన వైద్య రంగంలోకి అడుగు పెడుతున్న యువ వైద్యులకు అభినందనలు తెలిపారు. అలాగే సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. 2019 బ్యాచ్‌కు చెందిన 245 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పట్టాలు అందుకొని ఆనందంగా గడిపారు.
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ పీవీ నందకుమార్‌రెడ్డి హాజరై పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. మెడికల్ స్టూడెంట్స్పరిశోధన చేయడానికి ముందుకు వస్తే తమ వర్సిటీ ద్వారా కావాల్సిన నిధులను అందించి ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న హెల్త్ వర్సిటీ బ్రాంచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.