బిగ్ బాస్ సీజన్ 7లో యువ రైతు.. ఇంతకు ఎవరీ పల్లవి ప్రశాంత్?

బిగ్ బాస్ సీజన్ 7లో యువ రైతు.. ఇంతకు ఎవరీ పల్లవి ప్రశాంత్?

మరికొద్ది రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్(Bigg boss) సందడి మొదలై కానుంది. ఈ సీజన్ కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసారి కంటెస్టెంట్ లి ఎవరు? గేమ్స్, టాస్కులు ఎలా ఉండబోతున్నాయి అని బుర్రలు బద్దలు కోరుకుంటున్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్. వారి ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season 7)ను సెప్టెంబర్ మొదటివారంలో మొదలుపెట్టనున్నారు మేకర్స్. ఇక ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ప్రోమోలో నాగార్జున(Nagarjuna) చెప్పిన ఉల్టా పుల్టా అనే డైలాగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఒక్క డైలాగ్ తో ఈ కొత్త సీజన్ ఎలా ఉండబోతుందో అనే హిట్ ఇచ్చారు. 

అయితే బిగ్ బాస్ సీజన్ 7 నుండి వినిపిస్తున్న మరో న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రతీ సీజన్ లగే ఈ సీజన్ లో కూడా ఒక కామన్ మ్యాన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను మరెవరో కాదు. ప్రముఖ యూట్యూబర్ పల్లవి ప్రశాంత్.

చాలా మందికి ఈ పల్లవి ప్రశాంత్(Pallavi prashanth) ఎవరో తెలియదు. నిజానికి అతనికొక యువ రైతు. వ్యవాసాయం గురించి అతను చేసే వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతని యూట్యూబ్ ఛానెల్ కు 253కే మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అందుకే ఈసారి ఆ యువ రైతును హౌస్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారట బిగ్ బాస్ యాజమాన్యం. ఇప్పటికే సంప్రదింపులు కూడా  పూర్తయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.