గాడిదకు వినతిపత్రం ఇచ్చిన యువ రైతులు

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువ రైతులు వినూత్న నిరసన తెలిపారు. రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గాడిదకు వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ దాన్యం అమ్మి నెల రోజులు గడుస్తున్నా బకాయిలు విడుదల చేయడం లేదని వారు వాపోయారు.

సకాలంలో డబ్బు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. చివరకు గాడిదకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు.