- పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి
- నిర్మల్ జిల్లా ఇటిక్యాల్ లో ఘటన
పెంబి, వెలుగు: చదువుకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ సాయికుమార్ కథనం మేరకు ప్రకారం.. పెంబి మండలం ఇటిక్యాల్ గ్రామానికి చెందిన సీమల జయశ్రీ(17) ఇంటర్ చదువుతుండగా రెండేండ్ల కింద అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. దీంతో పరీక్షలు రాయకపోవడంతో ఫెయిలైంది. ఇంటి వద్దనే ఉంటూ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుంది.
చదువుకు దూరమయ్యాననే మనస్తాపంతో జయశ్రీ బాధపడుతుంది. ఆదివారం తల్లి సోమవ్వతో కలిసి పత్తి చేనుకు వెళ్లింది. అక్కడే పురుగుల మందు తాగింది. వెంటనే వెంటనే నిర్మల్ లోని ప్రభుత్వాసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ జయశ్రీ చనిపోయింది. తండ్రి లింగన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.