మేడ్చల్, వెలుగు: పోటీ పరీక్షల భయంతో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి సూసైడ్చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన కొమ్మురాజు సంగీత(24) చదువుకునేందుకు తన తమ్ముడు కృష్ణసాయితో కలిసి నాలుగు నెలలుగా మేడ్చల్‌లోని రాఘవేంద్రనగర్‌లో ఉంటుంది. గ్రూప్స్1, 4 పరీక్షలకు ప్రిపేర్అవుతోంది. కృష్ణసాయి స్థానిక సూపర్‌మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం కృష్ణసాయి డ్యూటీకి వెళ్లగా, సంగీత ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. ఉదయం 11.40 అప్పుడు కృష్ణసాయి తన అక్కకు ఫోన్‌చేయగా లిఫ్ట్‌చేయలేదు.
అనుమానంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా, లోపల నుంచి తలుపు గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా సంగీత పలకకపోవడంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే సంగీత చున్నీతో సిలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే యువతి చనపోయింది. గ్రూప్ఎగ్జామ్స్డేట్దగ్గరపడడంతో కొన్నిరోజులుగా సంగీత ఆందోళన చెందుతోందని, డిప్రెషన్లో సూసైడ్చేసుకుందని కృష్ణ సాయి మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.