వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి(Kriti Shetty) తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. నితిన్(Nithin) హీరోగా డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula) ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఇదివరకు ‘భీష్మ(Bheeshma)’ వంటి హిట్టిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిని హీరోయిన్గా సెలక్ట్ చేశారట. నితిన్‌తో కలిసి ఈ బ్యూటీ ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం(Macharla Niyojakavargam)’ అనే సినిమా చేసింది. పేలవమైన స్టోరీ, టేకింగ్ కారణంగా అదికాస్తా డిజాస్టర్‌గా మిగిలింది.
దీంతో బేబమ్మకు నితిన్ మరో చాన్స్ ఇచ్చాడు. అయితే, మాచర్ల సెంటిమెంట్ ఈ హీరో ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. మరోసారి ఆ సీన్ రిపీట్ కాకూడదని కోరుకుంటున్నారు. ఇప్పటికే నాగచైతన్య(Naga Chaitanya)తో చేసిన ‘కస్టడీ(Custody)’ ఫ్లాప్‌గా మిగిలింది. కనీసం ఈ సినిమాతోనైనా ఈ ఇద్దరు తారలు ఫామ్‌ను అందుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్‌లోనూ కృతి వరుస ఆఫర్లు అందుకుంటోంది.