హిట్ దర్శకుడితో యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా..

హిట్ దర్శకుడితో యాంకర్ సుమ కొడుకు కొత్త సినిమా..

‘బబుల్ గమ్‌‌‌‌’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన  యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్  హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘మోగ్లీ 2025’.  ‘కలర్‌‌‌‌‌‌‌‌ ఫొటో’ ఫేమ్  సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెలలో  రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్టు శుక్రవారం తెలియజేశారు.  

ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే ఈ లవ్‌‌‌‌స్టోరీ నుంచి  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్  పోస్టర్, టైటిల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.  సాక్షి సాగర్‌‌‌‌ మదోల్కర్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా పరిచయమవుతోంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే రోషన్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ ఏడాది సెకండాఫ్‌‌‌‌లో ఈ సినిమా  షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.