తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై యువ హీరో విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందంటూ ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నానని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమఅని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం..