సీనియర్ హీరోల ఫ్యామిలీలో చేరుతున్న క్రేజీ హీరోయిన్స్

సీనియర్ హీరోలకు హీరోయిన్ ని సెట్ చెయ్యడం మేకర్స్ కు ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ని సీనియర్ హీరోలకు సెట్ చేస్తే స్క్రీన్ మీద వారి ఏజ్ గ్యాప్ స్పష్టంగా కన్పిస్తుంది. అయితే ఈ మధ్య సీనియర్ హీరోలకు రక్త సంబంధీకులుగా మారుతున్నారు అందగత్తెలు. ప్రస్తుతం పలు భాషల్లో ఈ ట్రెండ్ నడుస్తోంది.

అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుంది. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. 45ఏళ్ల ఫాదర్ గా నటసింహం కనిపించబోతుంటే..ఈయనకు కూతురుగా శ్రీలీల కన్ఫామ్ అయిందట.పెళ్లి సందడి సినిమాతో శ్రీలీలా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమాను సరికొత్తగా చూపించబోతున్నారట డైరెక్టర్ అనిల్. ప్రస్తుతం శ్రీలీల ధమాకా మూవలో నటిస్తుండగా..బాలయ్య డైరెక్టర్ గోపిచంద్ మూవీతో బిజీగా ఉన్నాడు.

అదేవిధంగా పెద్దన్న సినిమాలో రజినీకాంత్ కు చెల్లెలిగా కన్పించింది కీర్తి సురేష్. ప్రజెంట్ మెగాస్టార్ కు సోదరిగా మారిపోయింది. భోళా శంకర్ మూవీలో చిరు, కీర్తి బ్రదర్ అండ్ సిస్టర్స్ గా నటిస్తుండగా..ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక విక్టరీ వెంకటేష్ పూజా హెగ్డేకు బ్రదర్ గా మారుతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వెంకీ డైరెక్ట్ గా ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ కబీ ఈద్‌ కబీ దివాళి మూవీలో నటిస్తున్నారు వెంకీ. ఈ మూవీలో అన్నా చెల్లెల్లుగా వెంకటేష్ - పూజాహెగ్దే కనిపించబోతున్నారట. ఇలా సీనియర్ హీరోలకు రక్తసంబంధీకులుగా మారిపోతున్నారు యంగ్ హీరోయిన్స్.

మరిన్ని వార్తల కోసం

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ కంపెనీ

25న థాంక్యూ టీజర్ రిలీజ్