గాంధీ భవన్​లో యంగ్ ఇండియా కే బోల్ బ్రోచర్ ఆవిష్కరణ

గాంధీ భవన్​లో యంగ్ ఇండియా కే బోల్ బ్రోచర్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు : యువత తమ గొంతును వినిపించడానికి ‘యంగ్ ఇండియా కే బోల్’ సీజన్–5 బ్రోచర్ ను శనివారం గాంధీభవన్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాతీయ యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, యంగ్ ఇండియా కే బోల్ రాష్ట్ర ఇన్ చార్జ్ నీతూ ఉషా కిరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ...నేటి యువత తమ గొంతు వినిపించడానికి ఈ ప్రోగ్రామ్ మంచి అవకాశమని తెలిపారు.

ఈ ప్రోగ్రామ్ లో వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చలు, రీల్స్ చేయడం వంటివి ఉంటాయని చెప్పారు. ఈ పోటీలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు యూత్ విత్ ఐవైసీ యాప్, వైఐకేబీ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.