
విదేశాల్లో మనవాళ్లు సాధించే విజయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. తాజాగా న్యూజిలాండ్‌లో మన దేశానికి చెందిన అమ్మాయి ఓ అరుదైన ఘనత సాధించింది. రమణ్‌దీప్‌కౌర్ సంధు అనే అమ్మాయి న్యూజిలాండ్‌లో పోలీస్‌గా ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.
సంధు పుట్టి, పెరిగిందంతా పంజాబ్లోనే. చదువు కూడా ఇక్కడే పూర్తి చేసింది. అయితే, 2012లో న్యూజిలాండ్‌లోని హ్యాక్స్ బే ప్రాంతానికి వెళ్లాక, కొంతకాలం రకరకాల జాబ్స్ చేసింది. అలాగే స్థానిక కల్చర్, ప్రజల గురించి కూడా బాగా తెలుసుకుంది. అయితే, తనకిష్టమైన పోలీస్ జాబ్ చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌పై ఉన్న ఇంట్రెస్ట్ ఆమెను పోలీస్‌జాబ్ వైపు వెళ్లేలా చేసింది.
పోలీస్ గ్రాడ్యుయేషన్
న్యూజిలాండ్‌లో పోలీస్ జాబ్ చేయాలంటే మనలాగే ఎంట్రన్స్ టెస్ట్ రాసి, ఫిజికల్ టెస్ట్ పాసవ్వాలి. అన్నింట్లోనూ అర్హత సాధిస్తే, పోలీస్ ట్రైనింగ్‌కు సెలెక్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ని పోలీస్ గ్రాడ్యుయేషన్‌గా పిలుస్తారు. ఇందులో పాస్ అయి, అర్హత సాధిస్తే పోలీస్‌గా ఎంపిక చేస్తారు. సంధు ఈమధ్యే సక్సెస్‌ఫుల్‌గా ట్రైనింగ్ ఫినిష్ చేసుకుని, పోలీస్ గ్రాడ్యుయేట్‌గా మారింది. తొలిసారి మన దేశం నుంచి అక్కడి పోలీస్‌గా ఎంపికైంది. దాంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ సంధుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
ఇన్వెస్టిగేషన్ ఇష్టం
‘‘పోలీస్ ఇన్వెస్టిగేషన్‌పై ఉన్న ఇష్టంతోఈ డిపార్ట్‌మెంట్‌లో చేరాలనుకున్నా’’ అని చెప్పింది సంధు. ‘‘నేను పోలీస్ అవ్వాలనుకున్నప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్లు ఎవరూ లేరు. మన దేశం నుంచి ఒక్క మహిళ కూడా న్యూజిలాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరలేదు. దీంతో ఎవరి సాయం తీసుకోవాలో తెలియలేదు. అయితే, స్థానికంగా ఉండే ‘ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ సాయంతో ఇందులో చేరా’ అని చెప్పింది సంధు.