SPగా జాయిన్ అవ్వటానికి వెళుతూ.. కారు యాక్సిడెంట్‎లో చనిపోయిన యంగ్ IPS ఆఫీసర్

SPగా జాయిన్ అవ్వటానికి వెళుతూ.. కారు యాక్సిడెంట్‎లో చనిపోయిన యంగ్ IPS ఆఫీసర్

చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదివాడు. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్ ఎగ్జామ్స్‎లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ పోస్ట్‎కు ఎంపికయ్యాడు. ఐపీఎస్ ట్రైనింగ్‏ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. కర్నాటకలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఈ క్రమంలోనే సంతోషంగా విధుల్లో జాయిన్ అయ్యేందుకు వెళ్తుండగా విధి ఆడిన వింత నాటకంలో ఆ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.

 పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‎కు చెందిన హర్ష్ బర్ధన్ అనే 27 ఏళ్ల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ కర్నాటకలోని హోలెనరసీపూర్‌ ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు. ఎస్పీగా రిపోర్ట్ చేసేందుకు 2024, డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కారులో కర్నాటక బయలుదేరాడు హర్షన్ బర్ధన్. హోలెనరసీపూర్‌ వెళ్తున్న క్రమంలో హసన్-మైసూరు రోడ్‌లోని కిట్టనే సమీపంలో ఐపీఎస్ ఆఫీసర్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురి అయ్యింది. కారు టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటిని ఢీకొట్టింది. 

Also Read :- మహిళా కానిస్టేబుల్‎ను.. కారుతో గుద్ది.. నరికి చంపారు

ఈ ఘటనలో హర్షన్ బర్ధన్, ఆయన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కారు డ్రైవర్, ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు మృతి చెందారు. ఎస్పీగా జాయిన్ అవ్వటానికి ఇంట్లో నుండి బయటికెళ్లిన హర్ష్ బర్ధన్ రోడ్డు ప్రమాదంలో మృతిచెండటంతో కుటుంబ సభ్యులు, కన్నీరు మున్నీరుగా విలపించారు. ఐపీఎస్ అధికారిగా ఎంతో భవిష్యత్ ఉన్న హర్ష్ బర్ధన్ విధుల్లో చేరేందుకు వెళ్తూ అనంతలోకాలకు వెళ్లడంతో బ్యాచ్‎మేట్స్, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హసన్ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.