రీసెంట్ గా ఓటీటీలో రిలీజైన సైకో థ్రిల్లర్ మూవీ కాలా బార్ బేరియన్(Kaala Baar Bariyan) చాప్టర్ 1. ఎలాంటి అంచనాలు లేకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ సినిమాలో నటించిన కరీంనగర్ కుర్రాడు ప్రజ్ఞన్(Pragyan) ట్రేండింగ్ లోకి వచ్చాడు.
ఈ సినిమాలో ప్రజ్ఞన్ మల్టీ పర్సనాలిటీ సైకో పాత్రలో నటించాడు. ఈ పాత్రలో ప్రజ్ఞన్ అద్భుతమైన నటనను కణబారిచాడు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలా తాను నటించిన తొలి చిత్రానికే మంచి గుర్తింపు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ప్రజ్ఞన్.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడాడు.. కాలా బార్బేరియన్ చాప్టర్ 1లో నా పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. పలువురు ప్రముఖ దర్శకులు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అది నాకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఒకే పాత్రలో మల్టీపుల్ పాత్రలు చేసే అవకాశం దొరికింది. ఏ నటుడికైనా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంత కంటే కావలసిందేముంది.. అంటూ చెప్పుకొచ్చాడు ప్రజ్ఞన్. ఈ విజయంతో టాలీవుడ్ లోను మనోడికి మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది.
- ALSO READ | ఆసక్తిగా స్పార్క్ మూవీ ట్రైలర్..