బర్త్ డే పార్టీకి పిలిచి.. ఓయో రూంలో గ్యాంగ్ రేప్ చేసిండ్రు

లాడ్జిలో దారుణం.. ముగ్గురు నిందితులు అరెస్ట్ 

హైదరాబాద్, వెలుగు: ఒక యువతిపై ఫ్రెండ్సే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బర్త్ డే పార్టీకి అని పిలిచి ముగ్గురు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె అసలు విషయం బయటపెట్టడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం ఈ సంఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. జూబ్లీహిల్స్​లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ యువతి(19) సికింద్రాబాద్​లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఇంటి దగ్గరలో నివసించే మాదోజు జోసెఫ్​(20), నవీన్​రెడ్డి(22), రాగని రాము(23) కొంతకాలంగా ఆమెతో ఫ్రెండ్​ షిప్ చేస్తున్నారు. ఈ నెల 5న యువతి టర్మ్​ ఫీజు కట్టడానికి కాలేజీకి వెళ్లింది. జోసెఫ్​ ఆమెకు ఫోన్​చేసి ఆరోజు తన బర్త్​డే అని నవీన్​రెడ్డి, రాముతో కలిసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. సికింద్రాబాద్​ వెళ్లి యువతిని తీసుకుని ట్యాంక్​బండ్​కు వెళ్లారు. అక్కడ నుంచి బిర్యాని పార్శిల్​ తీసుకుని కూకట్​పల్లి భాగ్యనగర్​కాలనీలోని ఆనంద్​ఇన్​(ఓయో) లాడ్జిలో సాయంత్రం రూమ్​ తీసుకున్నారు. నవీన్ ​బయటకు వెళ్లి తెచ్చిన కేక్‌కట్​ చేశారు. ప్లాన్​ ప్రకారం కేక్​లో మత్తుమందు కలిపి తినిపించారు. మత్తులోకి జారుకున్న తర్వాత రేప్ ​చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని యువతిని బెదిరించారు. అస్వస్థతగా ఉన్న యువతి ఈ నెల11న అన్ కాన్షియస్ కావడంతో కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్​లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేర్పించారు. తనపై జరిగిన అత్యాచారాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె పేరెంట్స్ జూబ్లీహిల్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అత్యాచారం కూకట్​పల్లిలో జరగటంతో కేసును అక్కడకు ట్రాన్స్​ఫర్​ చేశారు. యువతి స్టేట్​మెంట్ రికార్డు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.

For More News..

కరప్షన్‌‌‌‌లో సీఎం కేసీఆర్‌‌‌‌‌దే ఫస్ట్ ప్లేస్

కేసీఆర్ కారును జనం ముంచుతరు

నీళ్లున్నప్పుడు రాలేదు గాని.. పొయినంక వస్తరా?